ఎస్పీ బాలు పాట పాడిన దుబాయ్ షేక్.. వీడియో వైరల్?

praveen
తన సంగీతంతో అద్భుతాలు సృష్టించి తన స్వరాలతో రాళ్ళను సైతం కలిగించిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం..  ప్రస్తుతం భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మాత్రం అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు వింటూ ఉంటే కేవలం వినసొంపుగా ఉండడమే కాదు అటు మనసుకు ఏదో తెలియని ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను ఇప్పటి వరకు ఎంతోమంది సింగర్స్ పాడారు. అటు ఎంతోమంది అభిమానులు కూడా ఆయన పాటలు పాడుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వ్యక్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ఒక పాట పాడి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయారు. ఆయనకి అసలు తెలుగే రాదు కానీ ఆయన తెలుగు వాళ్ల కంటే అద్భుతంగా ఎస్పీ బాలు పాటలు పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.



 ఏకంగా ఒక దుబాయ్ షేక్ ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. 1986లో సూపర్ హిట్ అయిన సిరివెన్నెల చిత్రంలోని విధాత తలపున అనే పాటను దుబాయ్ షేక్ పాడాడు. మొదట అరబిక్ భాషలో ఏదో ఇంట్రడక్షన్ ఇచ్చిన దుబాయ్ షేక్ ఇక ఆ తర్వాత ఎస్పీ బాలు పాడిన పాటను ఎంతో అద్భుతంగా పాడాడు అని చెప్పాలి.  దుబాయ్ షేక్  పాడుతుంటే తెలుగు వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా పాడ లేరేమో అని అనిపిస్తూ ఉంటుంది... అంతలా తెలుగు రాకపోయినప్పటికీ ఎంతో అద్భుతంగా పాట పాడిన ఆయన ప్రస్తుతం తెలుగు ప్రజలందరికీ కూడా ఆకట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: