తెలుగు చిత్ర పరిశ్రమలో పరమ వరస్ట్‌ జంటలు ఇవే..!!

N.ANJI
చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరో, హీరోయిన్స్ జంట చూడటానికి కన్నుల పండగ ఉంటుంది. వారిద్దరి కాంబినేషన్ వచ్చే ప్రతి సినిమాను ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో కొన్ని వారెస్ట్ జంటలు కూడా ఉన్నాయి. వాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దామా.
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. అంతేకాదు.. ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కాగా.. ఈ సినిమాలో చిరుకి జోడీగా త్రిష నటించారు. అయితే ఈ జంట అసలు సెట్ కాలేదని అప్పుడు బాగా ట్రోలింగ్ చేసినట్లు సమాచారం. అలాగే టాలీవూడ్ సీనియర్ హీరోలలో ఒక్కరైనా నటసింహం నందమూరి బాలయ్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కలిసి జంటగా నటించిన సినిమా అల్లరి పిడుగు. అయితే ఈ జంట ప్రేక్షకుల నుండి సరైన ఆదరణ పొందలేకపోయింది.
విక్టరీ వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ సినిమా ఆయన సినిమా జీవితంలోనే భారీ డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణాలు తెలియలేదు. కాగా..  ఈ సినిమా తరువాత వెంకీకి సరైన హిట్ అందుకోలేదు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కు జంటగా జెనీలియా హీరోయిన్ గా జంటగా నటించింది. ఇక ఈ జోడి కూడా అస్సలు సెట్ కాకపోవడంతో ఈ జంట కూడా పరమ వరస్త్ జంటల జాబితాలో చేరింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఈ సినిమాకి చాలా టైం తీసుకోని షూటింగ్ చేశారు. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఇక ఈ ఇస్నిమలో హీరోయిన్లుగా నటించిన అనుష్క, సోనాక్షిసిన్హా లకు రజినీకాంత్ వయసుకు ఏమాత్రం పొంతన లేదని అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. కాగా.. ఈ జంటలు ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: