శ్రీకాంత్ ఆ పాత్రలో డూప్ లేకుండా నటించాడట...!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. శ్రీకాంత్ తన నటనతో పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడని సమాచారం. ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మురళి ఎంత విలక్షణ నటుడో అందరికీ తెలుసిన విషయమే. అలాగే ఒక దర్శకుడిగా మరియు ఒక నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడని సమాచారం. ప్రస్తుతం అయితే పోసాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా వున్నాడని తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే ఆయన స్వయంగా రచించి దర్శకత్వం చేసి ఎంతో ప్రత్యేకంగా నిలిచాడని సమాచారం. ఇదిలా ఉంటే 2007 వ సంవత్సరంలో ఆపరేషన్ దుర్యోధన సినిమా విడుదలయిందని అందరికి తెలుసు. ఈ సినిమాకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడట పోసాని. ఆపరేషన్ దుర్యోధన చిత్రంలో శ్రీకాంత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించారు. నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ గా మెప్పించారు.
అలాగే అవినీతి రాజకీయ నాయకుడిగా అలరించాడు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాని తీశారని తెలుస్తుంది.ఒకపక్క కాంట్రవర్సీలు వచ్చిన బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుందట ఈ సినిమా. ఇక ఈ సినిమాలో ఒక సీన్ హైలెట్ గా నిలిచిందని సమాచారం.ఈ చిత్రంలో శ్రీకాంత్ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ సీన్ డూప్ లేకుండా శ్రీకాంత్ చేశారని సమాచారం. దాని వెనక ఏం జరిగిందో మనం తెలుసుకుందాం.
పోసాని మొదట ఈ కథని శ్రీకాంత్ కి వివరించారట. అలానే ఈ సీన్ గురించి కూడా శ్రీకాంత్ కి తెలియజేశారని తెలుస్తుంది.అయితే ఈ సీన్ బాగా పాపులర్ అవుతుందని తప్పకుండా చేద్దాం అని శ్రీకాంత్ చెప్పారని సమాచారం. ఈ సీన్ హైదరాబాద్ లోనే చిత్రీకరించారట.మొదట చార్మినార్ దగ్గర షూటింగ్ చేశారట.అయితే ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదని తెలుస్తుంది. అదే విధంగా శ్రీకాంత్ తో అమీర్ పేట్ లో కూడా ఈ సీన్ చేశారని సమాచారం. అప్పుడు కూడా ఎవరో పిచ్చివాడు అనుకుని జనం గుర్తు పట్టలేదని సమాచారం. సినిమా చూసిన తర్వాత మాత్రమే జనానికి తెలిసిందని అప్పటి వరకు ఎవరికీ తెలియలేదని సమాచారం..