మరో వారం రాజమౌళికు ఓకే చెప్పిన ఎన్టీఆర్...!

murali krishna
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు సహనంతో ఎదురుచూస్తున్నారట.

ఈ సినిమాలో టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారని తెలిసిన విషయమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడని ఎవ్వరిని అడిగిన చెప్తారు.

ఈ సినిమా ఈ మధ్యనే షూట్ పూర్తి చేసుకుందని వార్తలు అయితే వచ్చాయని సమాచారం.కానీ అధికారికంగా మాత్రం ప్రకటన అయితే చెయ్యలేదని తెలుస్తుంది. కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయారంటూ టాక్ అయితే వచ్చిందని తెలుస్తోంది. కానీ ఈ షూట్ ఇంకా పూర్తి అవ్వలేదని సమాచారం. ప్రెసెంట్ ప్యాచ్ వర్క్ జరుగుతుందని సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయబోతున్నట్లు వార్త వినిపిస్తుంది.
ఈ సన్నివేశాలు రాజమౌళికి సంతృప్తి ఇవ్వలేదని సమాచారం.అందుకే మళ్ళీ ఈ షాట్స్ ను మళ్ళీ రీషూట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది . అయితే ఇందుకోసం ఎన్టీఆర్ ఒక వారం రోజుల కాల్షీట్స్ ఇచ్చాడని సమాచారం.. ఈ వారం రోజుల పాటు ఎన్టీఆర్ మళ్ళీ భీం గెటప్ వేస్తాడని సమాచారం. అయితే ప్రెసెంట్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పటికే ఎన్టీఆర్ ఈ షో కోసం షూటింగ్ లో పాల్గొని కొన్ని ఎపిసోడ్స్ షూట్ పూర్తి చేసాడని సమాచారం. ఇక ఇప్పుడు రెండవసారి మళ్ళీ షో కోసం షూటింగ్ లో పాల్గొంటున్నారట. ఈ షూట్ ఒక పది రోజుల్లో ముగుస్తుందని తెలుస్తుంది. ఇది అవ్వగానే ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నాడని సమాచారం. అయితే ఎన్టీఆర్ ఒక్కరేనా లేదంటే రామ్ చరణ్ కూడా ఇందులో పాల్గొంటున్నాడా అనేది ఇంకా బయటకు రాలేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: