తమిళ దర్శకుడితో వెంకీ, రామ్ చరణ్ మల్టీస్టారర్..!

Pulgam Srinivas
తెలుగులో చాలా రోజుల క్రితం మల్టీస్టారర్ లా హవా చాలా బాగానే కొనసాగింది. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి హీరోలు కలిసి నటించి తెలుగు ప్రజలను ఎంతగానో మెప్పించారు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు చాలా వరకు కరువయ్యాయని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తెలుగు జనాలకు మరొకసారి మల్టీస్టారర్ సినిమాలను పరిచయం చేసింది మాత్రం వెంకటేష్ , మహేష్ బాబు అనే చెప్పవచ్చు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ , మహేష్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ 2013లో విడుదలైన సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి సినీ జనాల్లో ఈ సినిమా పై అనేక అంచనాలు నెలకొన్నాయి.


 ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మల్టీ స్టారర్ సినిమా చూడబోతున్నామని అనేకమంది తెలుగు సినీ ప్రియులు ఈ సినిమాపై ఎంతగానో ఆసక్తి చూపారు. ఆ విధంగానే ఈ సినిమా కూడా ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా జనాలను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇదే కోవలో వెంకటేష్, రామ్ పోతినేని కలిసి 'మసాలా' సినిమాలో నటించి మెప్పించారు. అదేవిధంగా వెంకటేష్,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి 'గోపాల గోపాల' మల్టీ స్టారర్ సినిమాతో తెలుగు ప్రజలను అలరించారు.  ఇలా తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కూడా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' కూడా మల్టీస్టారర్ సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో తెలుగు టాప్ హీరోలు అయిన రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఇలా తెలుగులో ఫుల్ గా నడుస్తున్న మల్టీ స్టారర్  జోనర్ కు మరింత ఊపు తేవడానికి ఒక తమిళ దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు వెట్రి మారన్ తెలుగు టాప్ హీరోలు అయిన రామ్ చరణ్, వెంకటేష్ లతో ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్త నిజమే అయితే సరికొత్త మల్టీస్టారర్ సినిమా చూడవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: