చాలా తక్కువ సమయం కెరియర్ ఉండే హీరోయిన్ల సినిమా ప్రస్థానం బాగుండాలంటే ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని నెలల్లోనే వారి సినిమా జీవితం అంతమయ్యే విధంగా వారి భవిష్యత్తు ఉంటుంది. అలా ఎంతో మంది హీరోయిన్లు మంచి మంచి సినిమాలు చేసుకుని హీరోలకు సమానంగా స్టార్ డం తెచ్చుకుని కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ ఉన్నారు.
ఇంకొంతమంది కెరియర్లో తొలినాళ్లలోనే మంచి సినిమాలను ఎంచుకుని సూపర్ హిట్లు అందుకొని ఆ తర్వాత మంచి కథలను ఎంచుకోకుండా తమ కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ ఈ విధంగానే కొన్ని తప్పటడుగులు వేసి ఇప్పుడు సరైన మార్గంలో వెళుతుంది. కీర్తి సురేష్ మొదట్లో మంచి విజయాలతో స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతూ ఉండగా ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఇతర హీరోయిన్ల కంటే వెనుకబడి పోయింది.
ఇప్పుడు ఈమె దారిలో రష్మిక మందన వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె త్వరలోనే రాహుల్ రవీందర్ శతాబ్దంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సినిమాలు చేసి స్టార్ హీరోల సరసన నటించి మరింత పాపులారిటీ పొందాలి కానీ ఇప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ఏంటి అని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఏ హీరోయిన్ కెరీర్ చరమాంకంలో ఇలాంటి సినిమాలు చేస్తుంది కానీ కీర్తి సురేష్ మరియు రష్మిక మందన లు కెరియర్ మొదట్లోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం చాలా ప్రమాదం అని చెబుతున్నారు. అందరికీ అనుష్కల అరుంధతి సినిమా లాంటి హిట్ పడదు అని కూడా అంటున్నారు.ఈ నేపథ్యంలో తొలిసారి రష్మిక మందన చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ప్రయోగం ఏ రేంజ్ లో ఫలిస్తుందో చూడాలి.