ఏంటీ..?మెగాస్టార్ చిరంజీవి డాన్సులను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారా?అంతటి ధైర్యం ఎవరికి ఉంది అంటారా?నమ్మడానికి కాస్త కష్టంగానే ఇది నిజమే.ఈ రోజు చిరంజీవి ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తున్నారంటే దానికి కారణం ఓ వ్యక్తి. అరవై పదుల వయసులో కూడా చిరంజీవి వేసే డ్యాన్సులకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే దానికి ఒక వ్యక్తి విమర్శలే కారణం.ఆ రోజు ఆయనలా అనకపోయుంటే ఈ రోజు చిరంజీవి ఇంత బాగా డ్యాన్స్ చేసి ఉండేవాడు కాదేమో..ఇంతకీ చిరంజీవి డ్యాన్స్ ని విమర్శించిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..మెగాస్టార్ చిరంజీవి ఇండ్రస్టీకి అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన రోజులవి.అప్పటికే కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు ఇండ్రస్టీని ఏలుతున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఇండ్రస్టీ హిట్స్ తో దూసుకుపోతున్నారు.అలాంటి సమయంలో చిరంజీవి కొత్త తరహా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు.పాటలు వస్తే థియేటర్ నుండి బయటికి వెళ్లిపోయే ఆడియన్స్ ను కేవలం తన డ్యాన్సుల కోసమే థియేటర్లకు వచ్చేలా చేసాడు మెగాస్టార్.ఈ క్రమంలోనే తన ఐదవ సినిమా షూటింగ్ జరుగుతోంది.అప్పుడు మెగాస్టార్ ఒక పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసాడు.ఇక ఆ స్టెప్పులు చూసి సెట్ లో ఉన్న వారందరూ చప్పట్లు కొట్టారు.ఆ సినిమాకు మేనేజర్ గా పనిచేస్తున్న వెంకన్న మాత్రమే చిరంజీవిని అదోలా చూస్తున్నాడు.అది గమనించిన చిరు..వెంకన్న దగ్గరకు వెళ్లి తన డ్యాన్స్ ఎలా ఉందని అడిగాడు.
దానికి వెంకన్న బదులిస్తూ..అందులో నీ గొప్పదనం ఏముంది..నీ వెనకాల వాళ్ళు ఎలా చేశారో..నువ్వు కూడా అలాగే చేశావ్ కదా అని విమర్శించాడు.అయితే విమర్శను చాలా సీరియస్ గా తీసుకున్నాడు చిరు.అప్పటి నుండి డ్యాన్సుల్లో కొత్త మెళకువలు నేర్చుకొని..తన వెనకాల వాళ్ళు చేసే దానికి,కొరియోగ్రాఫర్ చేసిన దానికంటే మరింత కొత్తగా యాడ్ చేసి డ్యాన్సులు చేసుకుంటూ వచ్చాడు చిరంజీవి.అలా ఆ వ్యక్తి ఆరోజు చిరు చేసిన డ్యాన్సులను విమర్శించడం వల్లే..మెగాస్టార్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొని ఈ రోజుకి కూడా స్క్రీన్ పై తన డ్యాన్సులతో అదరగొడుతున్నాడు..ఇక ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని,విడుదలకు ముస్తాబవుతోంది...!!