బిగ్లో బాస్ లో బూతులు మాట్లాడండి.. పర్మిషన్ ఇచ్చిన నాగార్జున?
ఇక మొదటి రోజు నుంచే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ గొడవలు పడుతూ ఉండడంతో ఈ సీజన్ మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇకపోతే.. ఇక ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఫేమస్ యూట్యూబర్ సరయు కూడా ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా సరయు ఎప్పుడు బూతులు మాట్లాడుతూనే ఉంటుంది ఒకవైపు షార్ట్ ఫిలిమ్స్ లో మరోవైపు బయట కూడా తన బూతులతో అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. కానీ అటు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత దూకుడు తగ్గించి బూతులు మాట్లాడటం లేదు.
అయితే ఇటీవలే శనివారం ఎపిసోడ్ లో భాగంగా ఏకంగా కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడారు నాగార్జున. ఈ క్రమంలోనే సరయు తో మాట్లాడుతూ.. ఏమైందమ్మా డల్ అయిపోయావ్.. నీలా నువ్వు ఉండటంలేదు అంటూ అడుగుతాడు నాగార్జున.. అంటే బూతులు మాట్లాడితే మీరు తిడతారో ఏమో అని భయం సార్ అని చెబుతోంది సరయు.. నీలా నువ్వు ఉండమ్మా అలాగే బాగుంటావు అంటూ చెబుతాడు నాగార్జున. మీరు పర్మిషన్ ఇచ్చారు అంటే నా సామిరంగా ఇక దూసుకుపోతా అంటూ చెబుతుంది సరయు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడండి అంటూ అటు మిగతా కంటెస్టెంట్ అందరికీ కూడా ఇండైరెక్టుగా నాగార్జున చెప్పకనే చెప్పారు అని అంటున్నారు నెటిజన్లు.