అలా చేద్దాం.. డైరెక్టుగా షోలో అడిగేసిన సరయు.. నాగ్ షాక్?
బిగ్బాస్ హౌస్ విషయానికి వస్తే ఇక ఈ సీజన్లో చాలా మంది బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. ఇలా తెలిసిన వాళ్లలో అటు సరయు కూడా ఒకరు. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సరయు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. బూతులతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించి.. సోషల్ మీడియాలో ఎవరూ ఊహించనంత క్రేజ్ సంపాదించింది. అయితే ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో..ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా బూతుపురాణం ఓపెన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు సరయు ఎక్కడ భూతులను మాట్లాడలేదు అని చెప్పాలి.
అయితే ఇటీవలే ఈ శనివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడానికి రాగా.. ఏకంగా సరయు అందరి ముందే నాగార్జునను ఊహించని కోరిక కోరింది. దీంతో ఏకంగా నాగార్జున సైతం షాక్ అయ్యాడు అని చెప్పాలి. మీరు నన్ను డేట్ కి తీసుకెళ్తారా అంటూ ఏకంగా నాగార్జునను అడిగింది సరయు. నిన్ను నేను డేట్ కి తీసుకెళ్లాలి అంటే ముందు నువ్వు బయటకి రావాలి కదా అంటూ ప్రశ్నిస్తాడు నాగార్జున ఇప్పుడు కాదు సార్ 100 రోజుల తర్వాత డేట్ కి తీసుకెళ్తారా అంటూ సరయు చెబుతుంది. అయితే తప్పకుండా డేట్ కి తీసుకు వెళతాను అంటూ నాగార్జున చెబుతాడు. దీంతో ఆనందపడుతుంది. ఇలా పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే నాగార్జున ను సరయు డేట్ కి తీసుకెళ్తారా అని అడగడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.