మరో రికార్డ్ కొల్లకొట్టిన భీమ్లా నాయక్ గ్లిమ్స్ ?

NIKHIL VINAY
పవర్ స్టార్ సినిమా అంటే ఫాన్స్ లోనే కాదు సాధారణ జనాల్లో సైతం ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది వకీల్ సాబ్ తో పవన్ మళ్ళీ తన రేంజ్ ఏంటో అందరికి చూపించాడు. కరోన టైం లో కూడా వకీల్ సాబ్ 100 కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంకా ఆ సినిమాని మర్చిపోకముందే భీమ్లా నాయక్ వచ్చి ఒక్క గ్లిమ్స్ తో రచ్చ రచ్చ చేసింది. ఈ గ్లిమ్స్ కి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంతకాదు. ఈ చిన్న టీజర్ కి ఇప్పటికే 2కోట్లకి పైగా వ్యూస్ వచ్చాయి .అయితే ఇప్పుడు ఈ గ్లిమ్స్ కి కొత్త రికార్డ్ నెలకొల్పింది.

అదేంటి అంటే ఇండియాలోనే మొదటిసారిగా ఒక సినిమా గ్లిమ్స్ వీడియో కి 1 మిలియన్ లైక్స్ తెచ్చుకొని భీమ్లా నాయక్ రికార్డ్ సృష్టించింది. ఈ టీజర్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడానికి ముఖ్యమైన కారణం థమన్ అందించిన బిజియం అని చెప్పాలి. అలాగే పవర్ స్టార్ ఈ టీజర్ లో పవర్ ఫుల్ గా కనిపించి ఫాన్స్ ని కనివిందు చేశారు. సాగర్ కె చంద్ర లాంటి యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మలయాళంలో వచ్చిన అయ్యప్పన్ కొషియాన్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు నేటివిటీ కి సరిపోయేలా ఈ సినిమాని త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మార్చారు.

ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా అదే విజయాన్ని అందుకుంటుంది అని ఫాన్స్ ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12 న విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ కి సంక్రాంతి కి వచ్చే అన్ని సినిమాల కన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ సంక్రాంతి కి మహేష్ ,ప్రభాస్ సినిమాలు కూడా విడుదల కావడంతో ఈసారి రేస్ చాలా ఉత్కంఠగా ఉండబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: