ఇక మళ్ళీ టాలీవుడ్ లో మీడియం బడ్జెట్ సినిమాల సందడి మొదలైంది. నాని టక్ జగదీష్ గోపి చంద్ సీటీమార్ ఇక అలాగే తలైవి చిత్రాలు విడుదలవ్వడం జరిగింది.ఇక కరోనా వైరస్ సెకండ్ వేవ్ తరవాత ధైర్యంగా థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో సీటీమార్ తలైవి కూడా ఉన్నాయి.అవి థియేటర్ లో సందడి చేస్తున్నాయి.అయితే ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ నటించిన `మాస్ట్రో` సినిమా మాత్రం థియేట్రికల్ విడుదలను వదులుకుని OTT ప్లాట్ ఫామ్ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వహించాడు. ఈ థ్రిల్లర్ సినిమా హిందీ మూవీ అంధాధున్ అధికారిక రీమేక్ కావడం విశేషం. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నెగెటివ్ పాత్రలో నటించగా.. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నితిన్ ప్రియురాలిగా నటిస్తోంది.
ఇక ఈ మెస్మరైజింగ్ థ్రిల్లర్లో నితిన్ అంధుడిగా కనిపించనున్నాడు.ఇక తాజాగా మాస్ట్రో సినిమా నుంచి టైటిల్ సాంగ్ వీడియో విడుదలవ్వడం జరిగింది. మ్యాస్ట్రో మ్యాస్ట్రో అంటూ సాగే ఈ పాటలో నితిన్ క్లాసీ స్టెప్పులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఇక నభా నటేష్.. అలాగే తమన్నా మెరుపులు అందరిని బాగా మైమరిపిస్తున్నాయి.ఇక షురూకరో షురూ కరో అంటూ ట్యూన్ ని ప్రారంభించి అంతకంతకు అదిరిపోయే స్టెప్పులతో సెట్టింగులతో హీట్ పెంచడం జరిగింది. ఒక రకంగా మాస్ట్రో సినిమా తమన్నా, నభా నటేష్ లాంటి ఇద్దరు అందగత్తెల నడుమ ఒక రేంజులో నలిగిపోవడం జరిగింది. అలాగే మధ్యలో కూడా సీనియర్ నరేష్ పాత్రను ప్రవేశ పెట్టారు ఈ పాటలో. ఓవరాల్ గా ఈ సాంగ్ సినిమా అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇందులో అంధుడే అయినా స్టిక్ తో అద్భుతంగా స్టెప్పులేశాడు నితిన్.ఇక మ్యాస్ట్రో సినిమా సెప్టెంబర్ 17 వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.