స్టార్ డైరెక్టర్ దారేటు..?

Pulgam Srinivas
చాలావరకు ప్రస్తుతం ఉన్న దర్శకుల శైలి మారింది. ఎప్పుడు కొత్తరకం సినిమాలను తీయడానికి మరియు అలాంటి సినిమాలతో జనాల ముందుకు రావడానికి ఈతరం దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాంటి దర్శకులలో ఒకరు శివ నిర్వాణ. ఈ దర్శకుడు నాని హీరోగా నివేదాథామస్ హీరోయిన్ గా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఒక కొత్తరకం ప్రేమకథను వెండితెరపై చూపించు జనాలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి విజయం అందుకున్న ఈ దర్శకుడు, ఆ తర్వాత నాగచైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా 'మజిలీ' సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాలో కూడా ఒక సున్నితమైన ప్రేమకథను అంతే సున్నితమైన భావోద్వేగాలతో వెండితెరపై ఆవిష్కరించి రెండవసారి కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఈ రెండు విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు మూడవ సినిమాగా నాని హీరోగా రీతువర్మ హీరోయిన్ గా 'టక్ జగదీష్' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయాలి అని అనుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ 'ఓటిటి' లో విడుదల చేశారు. ఈ సినిమాకు కొన్ని వర్గాల నుండి మంచి టాక్ రాగా మరికొన్ని వర్గాల నుండి పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. కానీ 'టక్ జగదీష్' సినిమాతో మొదటిసారి శివ నిర్వాణ పూర్తి స్థాయి ఫ్యామిలీ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా జనాల నుండి డివైడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ దర్శకుడు నెక్స్ట్  ఎవరితో సినిమా చేయబోతున్నాడు అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మరియు మరొక సినిమాకు కూడా కమిట్ అయి ఉన్నాడు. విజయ్ దేవరకొండ తో కమర్షియల్ యాక్షన్ సినిమా తీయాలనే ఆలోచనలో శివ నర్వాన ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ, శివ నిర్వాన కు డేట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మరో హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: