ప్రముఖ సింగర్ మనో అంటే తెలియని తెలుగు వారు ఉండరు. ఒక్క తెలుగు మాత్రమే కాదు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ ప్రేక్షకులకు కూడా ఈయన బాగా సుపరిచితులే. ఈ నాలుగు భాషల్లోనూ తన స్వరంతో సుమారు నాలుగు వేలకు పైగానే పాటలను పాడారు మనో. గాయకుడి గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా తన మల్టీ టాలెంట్ లను నిరూపించుకున్నారు. తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులోనూ అంతే స్టార్ డం ఉన్న సీనియర్ హీరో. అంత గొప్ప హీరోకి తెలుగులో డబ్బింగ్ చెప్పేది సింగర్ మనోనే. సింహం లాంటి ఆయన నటనకు ఘర్జించే మాటలను తెలుగులో చెప్పేది సింగర్ మనోనే. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మనో తన వ్యక్తిగతంగా కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తే. ఈయనకు సాయం చేయడం అంటే చాలా ఇష్టమట అవసరంలో ఉన్న వారికి తనకు చేతనైనంత సాయం చేస్తూ అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటారు మనో.
ఇంకో విషయం ఏమిటంటే మనో అసలు పేరు నాగూర్ బాబు ఈయన ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తో పాటు ఆర్థికంగా కూడా బాగానే స్థిరపడ్డారు. ఇటు తన వ్యక్తిగత జీవితంలోను భార్య బిడ్డలతో సంతోషకరమైన జీవితం. అయినా ఆయన జీవితంలో తీరని విషాదం ఒకటి అలాగే ఉండిపోయింది. ఎన్నో ఏళ్లుగా మనో మనసులో దాగున్న ఆ నిజం ఏమిటంటే తన గారాల కొడుకుని చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు మనో. మనో సతీమణి పేరు జమీలా వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె. అయితే ఒక కొడుకు ప్రమాదవశాత్తు వీరికి దూరమయ్యాడట. మూడవ కొడుకైన షాహిల్ నాలుగేళ్ల వయసులో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక చిన్న సంపులో పడి ప్రమాదవశాత్తు మరణించాడు.
ఎంతమంది సంతానం ఉన్నా ప్రతి బిడ్డ తల్లితండ్రులకు ప్రత్యేకమే. పేగు బంధాన్ని పోగొట్టుకున్న మనో ఆయన భార్య ఇప్పటికీ ఆ విషయంలో ఎంతగానో బాధపడుతుంటారు. తమ నాలుగేళ్ల చిన్నారి తమకు దూరమైన లోటు వారి జీవితంలో ఎపుడు ఉండనే ఉంది. అయినా జీవిత ప్రయాణంలో ముందుకు సాగక తప్పదు ఈ విషయాన్ని అర్థం చేసుకుని దైర్యాన్ని కూడగట్టుకుని జీవన ప్రయాణంలో ముందుకు సాగారు మనో. ఇపుడు ఆయన ఇద్దరు కుమారులు బాగానే సెటిల్ అయ్యారు. కుమార్తె అమెరికాలో ఉంటుంది.