రజినీకాంత్ కు మనో మొదట డబ్బింగ్ ఏ సినిమా కి చెప్పాడంటే!!
ముఖ్యంగా రజనీకాంత్ కు ఆయన డబ్బింగ్ చెబితే సాక్షాత్తు ఆయనే వచ్చి డబ్బింగ్ చెప్పినట్లుగా ఉంటుంది అని అంటూ ఉంటారు. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఒకేసారి విడుదల అయ్యే రజినీకాంత్ సినిమా లో ఆయన డైలాగ్ డెలివరీ కి, స్టైల్ కి ఏ మాత్రం తగ్గకుండా అదే ఎనర్జీ తో డబ్బింగ్ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు మనో. అలా రజినీకాంత్ కు ముందు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పగా భాషా చిత్రానికి సాయి కుమార్ అదిరిపోయే విధంగా డబ్బింగ్ చెప్పాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
తెలుగులో ఆ సినిమాలోని డైలాగులు కూడా హిట్ అయ్యాయి. అలాగే పెదరాయుడు సినిమాలో కూడా రజినీకాంత్ కి డబ్బింగ్ చెప్పాడు సాయి కుమార్. అయితే కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేసిన ముత్తు సినిమాలో సాయి కుమార్ ను సంప్రదించగా అప్పటికి ఆయన హీరోగా బిజీగా ఉండడంతో డబ్బింగ్ చెప్పడానికి టైం కుదరలేదు. దాంతో ముసలి రజినీకాంత్ పాత్ర కి తొలి సారి డబ్బింగ్ చెప్పారు మనో. అదే టైంలో సాయికుమార్ బిజీగా ఉండడంతో యంగ్ రజినీకాంత్ పాత్రకి కూడా మీరే చెప్పాలి అని మనో కి చెప్పడం ఆయన ఒప్పుకోవడం జరిగింది. అలా అప్పటి నుంచి సాయి కుమార్ కి బదులు మనో డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు.