డబుల్ యాక్టింగ్ తో వచ్చి వివిధ భాషల్లో అదరగొట్టిన తెలుగు సినిమా..!

Divya
సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో డబుల్ యాక్షన్ రోల్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. డబుల్ యాక్షన్ సినిమాలు ఒకరికొకరు పొంతన లేకుండా వారి నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక అలాంటి సినిమాలలో హలో బ్రదర్ కూడా ఒకటి. 1994వ సంవత్సరంలో ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిత్రం హలో బ్రదర్. ఈ చిత్రానికి నిర్మాతలుగా కె.ఎల్.నారాయణ నిర్మించారు.. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్య తో పాటు హీరో నాగార్జున నటించి ప్రేక్షకులను మెప్పించాడు..
ముఖ్యంగా రాజ్ కోటి సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ సినిమాను 1992 వ సంవత్సరంలో విడుదలైన హాంగ్ కాంగ్ యాక్షన్ కామెడీ ట్విన్ డ్రాగన్స్ అనే సినిమా నుంచి, తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి అనుగుణంగా ఈవీవీ సత్యనారాయణ కథను మార్చి ప్రేక్షకులకు అందించడం జరిగింది.ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకోవడంతో 1997లో హిందీలో జుద్వా, 2017 లో జుద్వా 2 సీక్వెల్స్ కూడా రీమేక్ చేసి విడుదల చేశారు. కన్నడ ఇండస్ట్రీ లో కూడా 1997లో చెలువ అని పేరుతో సినిమాను రీమేక్ చేయడం జరిగింది. అంతేకాదు 2018 వ సంవత్సరం లో భాయిజాన్ ఏలోరే అనే సినిమా టైటిల్ తో హలో బ్రదర్ సినిమా నుంచి రీమేక్ చేయడం జరిగింది.

ఇక ఈ సినిమాలో నాగార్జున డ్యుయల్  పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా రమ్యకృష్ణ , సౌందర్య ఇద్దరిని ఒకరికొకరు కన్ఫ్యూజ్ చేస్తూ సాగే ఈ కథ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది.. మొదటి రోజే ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రాజ్ కోటికి 1994వ సంవత్సరంలో ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు లభించింది.  ఎస్ గోపాల్ రెడ్డి కి ఉత్తమ  సినిమాటోగ్రాఫర్ గా, ఉత్తమ ఎడిటర్ గా రవీంద్రబాబు నంది అవార్డులు కైవసం చేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: