సుకుమార్- కొరటాల బాటలోనే త్రివిక్రమ్..!!
ఇక ఇటీవల పవన కళ్యాణ్ సినిమాలైనా పింక్- భీమ్లా నాయక్ స్క్రిప్టులకు త్రివిక్రమ్ పర్యవేక్షకుడిగా ఉన్నాడు. అంతేకాదు.. సినిమాకి ఆయన మాటలు కూడా అందిస్తున్నాడు. అయితే బాలీవుడ్ సినిమా `పింక్` చిత్రాన్ని `వకీల్ సాబ్` టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి అందరికి తెల్సిన విదితమే. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. కాగా.. కథలో మార్పులు చేర్పులు చేసింది త్రివిక్రమ్ అని ప్రచారంలో జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ చిత్రం దర్శకత్వంలో మలయాళం సినిమా `అయ్యప్పునం కోషియమ్` ని `భీమ్లా నాయక్` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ విషయంలో త్రివిక్రమ్ భాగస్వామ్యం పబ్లిక్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. వకీల్ సాబ్ విషయంలో పైపైన టచ్ అప్ లు ఇచ్చి పేరు వేసుకోకపోయినా `భీమ్లా నాయక్` కి మాత్రం డైరెక్ట్ గా స్క్రీన్ న్ ప్లే త్రివిక్రమ్ అందిస్తునట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. దర్శకుడిగా సాగర్ చంద్ర ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఆయనకి త్రివిక్రమ్ బ్యాకప్ ప్లస్ అవుతుందని సమాచారం.
అంతేకాదు.. మాటల మాంత్రికుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా క్రియేటివ్ మేకర్ క్రిష్ కి కొన్ని విషయాల్లో సాయపడుతున్నట్టు టాక్ వినపడుతుంది. అయితే ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే పిరియాడిక్ చిత్రలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. ఇక ఇందులో భారీ పోరాట సన్నివేశాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని మార్పుల బాధ్యతల్ని త్రివిక్రమ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.