రమ్యకృష్ణ ఒక్క రోజు పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటూ అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి.. నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి రమ్యకృష్ణ.తెలుగు వెండితెరకి 'భలే మిత్రులు' అనే సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేయింది రమ్యకృష్ణ.కానీ ఆ సినిమా ఈమెకు ఎలాంటి గుర్తింపును తేలేదు. ఆ తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసారు. ఇక హీరోయిన్ గా తనకు అవకాశాలు రావేమో అనే సమయంలో కె. విశ్వనాథ్ ఆమె నట జీవితాన్నే ఓ మలుపు తిప్పారు.ఆయన దర్శకత్వంలో 'సూత్రధారులు' సినిమా వచ్చింది. ఆ సినిమాలో సీతాలు అనే పాత్రలో రమ్యకృష్ణ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

దాంతో మొదటి విజయాన్ని అందుకున్న ఆమె.. ఇక ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన అల్లుడు గారు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు లాంటి సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత హలో బ్రదర్,ఘరానా బుల్లోడు, క్రిమినల్ లాంటి చిత్రాల్లో తన గ్లామరస్ నటనతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా నటించి అక్కడ కూడా టాప్ హీరోయిన్ గానే కొనసాగింది.ఇక హీరోయిన్ గానే కాకుండా నెగెటివ్ పాత్రల్లో కూడా తన మార్క్ నటనను కనబర్చింది రమ్యకృష్ణ. ముఖ్యంగా రజినీకాంత్ నటించిన 'నరసింహా' సినిమాలో ఈమె పోషించిన..

నీలాంబరి పాత్ర ఎంత సంచలనమో తెలిసిందే.ఇలాంటి పాత్రలు తన కెరీర్లో చాలానే పోషించింది ఈ సీనియర్ హీరోయిన్. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభాస్ కి తల్లిగా బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఇక ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రల్లో నటిస్తున్న రమ్యకృష్ణ ఒక రోజుకు సుమారు పది లక్షల రూపాయల వరకు పారితోషకాన్ని తీసుకుంటుందట.అంటే ఒక సినిమాలో పది రోజులు నటిస్తే కోటి రూపాయల వరకు అందుకుటుందన్నమాట.దీన్ని బట్టి ఇప్పటికీ రమ్యకృష్ణ క్రేజ్ ఈ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇక ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాతో పాటూ సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాల్లో నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: