చరణ్ నెవర్ బిఫోర్ ... నెవర్ ఎగైన్ రోల్ లో ... ??

GVK Writings
రామ్ చరణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య సినిమాలు చేస్తున్నారు. కాగా వీటిలో ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా అలానే చరణ్ అల్లూరి సీతారామరాజుగా కన్పిస్తారు.
ఇప్పటికే ఈ మూవీ పై వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందు రానుంది. అలానే చిరంజీవి తో కలిసి చరణ్ చేస్తున్న మూవీ ఆచార్య. కొరటాల శివ తీస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా త్వరలో విడుదల కానుంది. వీటి తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తీయనున్న భారీ పాన్ ఇండియా మూవీలో నటించనున్నారు చరణ్. శంకర్ తీయనున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా చేస్తుండగా థమన్ సంగీతం అందించనున్నారు. ఇటీవల దీనిని అధికారిక పూజ జరిగింది.
అయితే ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తీయనున్నారట శంకర్. మరీ ముఖ్యంగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉంటుందట. ఆయన ఈ మూవీలో పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. సినిమా ఆద్యంతం ఆడియన్స్ ని అలరించేలా మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట. ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: