ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా పలుమార్లు రీ షూట్ చేసుకుని ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జిల్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాధాకృష్ణ లోని ప్రతిభను గుర్తించి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆయన దర్శకత్వంలో పలు లోపాల వల్ల ఈ సినిమాను చాలా సార్లు రీ షూట్ చేయవలసి వచ్చింది. దానికి తోడు కరోనా కూడా అడ్డు రావడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది.
చివరకు చివరిదశ చిత్రీకరణకు చేరుకుంది ఈ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు సంబంధించిన అప్డేట్ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా అలరించాయి. ఇప్పుడు ఈ చిత్రంలోని ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా రావడానికి ఇంకా మూడు నెలలు టైం ఉండడంతో ఈ చిత్రంలోని ట్రైలర్ ని విడుదల చేసి సినిమాపై అంచనాలను భారీగా పెంచాలని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇన్ని సార్లు రిజల్ట్ చేసేసరికి అభిమానుల్లో ఈ సినిమాపై బజ్ చాలా తక్కువ అయిపోయింది అని చెప్పాలి.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఇక్కడ రాధే శ్యామ్ సినిమాలా అయిపోతుందని అభిమానులు ఎంతగానో కలవరపడుతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నారని వార్తలు బయటకు రావడంతో ఇప్పుడు ఈ సినిమా ఎక్కడ క్రేజ్ తగ్గించుకుంటూదో అని వారు కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ ఒలివియా మోరీస్ లకు సంబంధించిన కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని రాజమౌళి భావించాడు. ఈ నేపథ్యంలోనే ఈ రీషూట్ ల గోల ఏంటి అని సినిమా అభిమానులు చెబుతున్నారు. మరి రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు క్రమంలో ఇంకా ఎన్ని మార్పులు చేస్తాడో చూడాలి.