టాలీవుడ్ లో నిన్ను కోరి,
మజిలీ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు దర్శకుడు
శివ నిర్వాణ. అయితే తన మూడవ సినిమాను మళ్ళీ
న్యాచురల్ స్టార్ నాని తో తెరకెక్కించాడు. ఆ సినిమానే 'టక్ జగదీష్'.తాజాగా
సెప్టెంబర్ 10 వినాయక చవితి సంధర్భంగా ఓటీటీ
వేదిక అయిన
అమెజాన్ ప్రైమ్ లో ఈ
సినిమా విడుదల అయ్యింది. అయితే కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు
శివ నిర్వాణ. కానీ ఈ
సినిమా యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో కాస్త లో హ్యాట్రిక్ హిట్ మిస్సయ్యాడు
శివ నిర్వాణ.నాని
టక్ జగదీష్ పై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
కానీ ఆ అంచనాలను ఈ
సినిమా అందుకోలేకపోయింది.ఇక
సినిమా థియేటర్లలో రాలేదు కాబట్టి..ప్రాఫిట్, లాస్ ల గురించి తెలియదు.ఒకవేళ థియేటర్లలో కనుక విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా లాస్ వచ్చేది.అయితే
అమెజాన్ ప్రైమ్ వాళ్ళు మాత్రం
టక్ జగదీష్ సినిమాకి మంచి వ్యూస్ వస్తున్నాయని అంటున్నారు.ఇక ఇదిలా ఉంటె
టక్ జగదీశ్ తర్వాత రౌడీ
హీరో విజయ్ దేవరకొండ తో ఓ
సినిమా చేయాలని ప్లాన్ చేసాడు
శివ నిర్వాణ.అయితే
టక్ జగదీష్ రిజల్ట్ చూశాక
విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని తెలుస్తోంది.ఇక ఈ ప్రాజెక్ట్ ని మైత్రీ
మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో
విజయ్ దేవరకొండకు బదులుగా అక్కినేని
హీరో నాగ చైతన్య రీప్లేస్ అయ్యాడని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే గతంలో
శివ నిర్వాణ తో
నాగ చైతన్య 'మజిలీ'
సినిమా చేసాడు. ఆ
సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి
శివ నిర్వాణ తో సినిమాకు సిద్దమవుతున్నాడు.ఇక ఇప్పటికే చైతూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.తాజాగా చైతూ నటించిన 'లవ్ స్టోరీ'
సినిమా అన్ని అవాంతరాలను దాటుకొని
సెప్టెంబర్ 24 న విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాతో పాటూ
విక్రమ్ కె
కుమార్ డైరెక్షన్లో 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ
సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.ఇక ఇప్పుడు
శివ నిర్వాణ తో
సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది...!!