కమల్ హాసన్ మొదటి భార్య ఎన్ని కష్టాలు పడిందో తెలుసా..?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సంచలన రికార్డులను సృష్టించారు.చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని పొందిన ఈయన రాజకీయాలలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇక కమలహాసన్ మొదటి భార్య సారిక తన జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సారిక ఢిల్లీలో జన్మిచారు. ఆమె తల్లిదండ్రులు మరాఠీకి చెందిన రాజపుత్ర వంశానికి చెందిన వాళ్ళు. ఇక అనివార్య కారణాలతో సారిక తండ్రి చిన్నప్పుడే వీరి ఇంటి ని వదిలిపెట్టి వెళ్లడంతో, ఇక ఇంటి బాధ్యతలు అన్నీ సారికనే తీసుకోన్నారు. అయితే నిజం చెప్పాలంటే ఈమె పాఠశాలనే ఎరుగదు.. ఎప్పుడు చూసినా ఏదో ఒక అవకాశం కోసం ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ చక్కర్లు కొడుతూ, ఉన్న డబ్బు అంతా పోగొట్టుకుంటూ ఉండేదంట. అంతేకాదు.. సారిక చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదట.. తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇక ముఖ్యంగా తన 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చిందట సారిక.
ఇక ఎలాగైనా సరే ఏదైనా అవకాశం సాధించాలన్నా ఆలోచనతో ,సినీ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ.. ఒకసారి అలా కార్లో కూర్చొని అలాగే ఆలోచిస్తూ ఉండిపోయేదంట. ఆమె ఏకంగా ఆరు రోజుల పాటు ఆమె ఆ కారు నుంచి బయటికి రాలేదు అని తెలుస్తోంది. ఇక తిండి లేక అలాగే ఆలోచిస్తూ చాలా నీరసించి పోయారంట. సారిక గురించి ఈ విషయాలన్నీ చాలామందికి తెలియదు అని చెప్పాలి మరి. అయితే తిరిగి తన 28 సంవత్సరాల వయస్సులో కమలహాసన్ ను పెళ్లి చేసుకొని 43 సంవత్సరాల వయస్సులో ఆమె విడాకులు తీసుకున్నారు. అంతేకాదు.. తన ఇద్దరు కూతుర్లు తీసుకొని ముంబైకి వెళ్లిన సారిక , ఆ తర్వాత నటనను ప్రారంభించిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: