క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడీ హీరో.. నటనతో వావ్ అనిపించాడు?

praveen
అల్లరి నరేష్..  ఈ పేరు చెబితే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ తెగ నవ్వుకుంటారు. అంతలా తెలుగు ప్రేక్షకులందరినీ తన కామెడీ సినిమాలతో అలరించాడు నరేష్. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. అయితే  ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేసే నరేష్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. ఇలా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి  ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు అని చెప్పాలి.



 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ హీరో అయిన నరేష్ సూపర్ స్టార్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏంటి.. ఏదో కమెడియన్గా చేసి ఉంటాడులే అని అందరూ అనుకున్నారు. కానీ అటు మహేష్ బాబుతో సహా  సినిమా మొత్తం సాగిపోయే ఒక కీలక పాత్రలో నటించిన నరేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. మహేష్ బాబు స్నేహితుడు పాత్రలో నటించాడు.  ఇక నరేష్ ఈ పాత్రలో తన నటనతో ప్రాణం పోసాడు అని చెప్పాలి.  కామెడీ హీరో ఏంటి మహేష్ బాబు సినిమాలో నటించడం ఏంటి అని అనుకున్న వాళ్లు అందరి నోళ్ళు ముయిస్తూ ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు నరేష్.


 స్నేహితుడి కోసం ఏకంగా జీవితాన్ని మొత్తం త్యాగం చేసి.. ఇక ఊర్లోకి వెళ్ళి మాసిన గడ్డంతో ఊరి బాగు కోసం పోరాడే యువకుడి పాత్రలో నటించాడు అల్లరినరేష్. మహేష్ బాబు అల్లరి నరేష్ మధ్య సాగే సంభాషణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఇక మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అప్పటి వరకు కేవలం కామెడీ హీరోగా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అల్లరి నరేష్ ఇక మహర్షి సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక తనలోని నటుణ్ణి ప్రూవ్ చేసుకున్నాడు అల్లరోడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: