ఆయన పాత్రకే కాదు.. సినిమాకి ప్రాణం పోసే క్యారెక్టర్ ఆర్టిస్ట్?

praveen
సినిమా అన్న తర్వాత ఎక్కువగా కనిపించేది హీరో హీరోయిన్లు మాత్రమే ఓవైపు హీరోయిన్లు తమ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటే..  మరో వైపు హీరోలు అదిరిపోయే ఫైట్ లు చేస్తూ ప్రేక్షకులందరినీ ఉర్రూత లూగిస్తూ ఉంటారు. కానీ సినిమాకు ప్రాణం పోస్తూ.. ప్రేక్షకులకు ఎక్కడ సినిమా పై బోర్ కొట్టకుండా చేస్తూ.. నటన తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూ సినిమాను ముందుకు నడిపించేది మాత్రం ఆ సినిమా లోని క్యారెక్టర్ ఆర్టిస్టులే అని చెప్పాలి. ప్రతి సినిమా లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులదే కీలక పాత్ర.



 క్యారెక్టర్ ఆర్టిస్టులు సరిగ్గా నటించక పోతే అటు హీరో హీరోయిన్లు ఎంత అద్భుతం గా నటించినప్పటికీ సినిమా లైన్ మాత్రం ప్రేక్షకులకు ఎక్కదు.  అందుకే ప్రతి సినిమా లో కూడా పాత్రకు తగ్గ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక అద్భుతమైన నటుడిగా ప్రస్థానాన్ని కొన సాగిస్తూ ప్రస్తుతం నటకిరీటి గా మారి పోయిన రాజేంద్ర ప్రసాద్ ఎన్నో పాత్రల తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అనే చెప్పాలి.


 ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయి నటించి పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్.  ఇక రాజేంద్ర ప్రసాద్ ఏదైనా సినిమాలో పాత్రల్లో నటించారు అంటే చాలు..  ఆ పాత్రను ఆయన తప్ప అంత బాగా ఇంకొకరు పోషించి లేరు అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోయిన రాజేంద్ర ప్రసాద్  కేవలం పాత్రలకు మాత్రమే కాదు అటు సినిమాకి తన నటనతో ప్రాణం పోసే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: