క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తాడు...
సినిమాలలో హీరో, హీరోయిన్లతో పాటు సహాయక నటులు, విలన్ పాత్రధారులు కూడా కీలక పాత్రను పోషిస్తారు. కొందరు సహాయక నటులు ఉన్నారంటే ఆ సినిమా క్రేజ్ మరింత పెరుగుతుంది. అటువంటి నటులలో ఒకరు తమిళ నటుడు సత్యరాజ్. అటు తమిళ్ ఇటు తెలుగులోనూ ప్రముఖ సహాయక నటుడిగా గొప్ప కీర్తిని పొందారు. ఈయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య సినీరంగంలోకి ప్రవేశించాక సత్య రాజ్ గా పేరును మార్చుకున్నారు. 1978 లో ప్రతినాయకుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సత్య రాజ్ నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో 200 లకు పైగా చిత్రాల్లో నటించారు.
ఈయన ఇప్పటి వరకు నటించిన అన్ని తెలుగు సినిమాలలో పాత్రలు చాల కీలకం. గోపిచంద్ హీరోగా నటించిన శంఖం మూవీలో ఒక ఫ్యాక్షనిస్ట్ గా రాయలసీమ నాయకుడిగా హీరోకు తండ్రిగా సినిమా విజయంలో ముఖ్య ఆభూమిక పోషించారు. డార్లింగ్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో హీరో తండ్రి పాత్ర ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాలోనూ సత్యరాజ్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. జక్కన్న తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలలో సత్యరాజ్ (కట్టప్ప) నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ సినిమాలో తన పాత్ర అంత కీలకం. ఈ సినిమా తర్వాతా సత్యరాజ్ అన్ని అందరూ మరిచిపోయారు. అందరూ కట్టప్ప అంటున్నారు.
గత మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్ తో చేసిన "ప్రతిరోజూ పండగే" చిత్రంలో అంతా ఆయనే కనబడతారు. ఒక నాన్నగా, ఒక స్నేహితుడిగా, ఒక తాతగా అన్ని చోట్ల తానే నటించి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏడ్చేలా చేయడంలో కట్టప్ప సక్సెస్ అయ్యాడు. ఒక సహాయ నటుడి పాత్రలో అంత బలముందా సినిమా ఫలితాన్ని నిర్ణయించగలడు అన్ని నిరూపించి చూపించాడు.