నాచురల్ స్టార్ నాని కెరియర్ ప్రారంభం నుండి ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలను చేయకుండా తన లో ఉన్న ఒక వైవిధ్యమైన నటుడిని జనాలకు పరిచయం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. లవ్ స్టోరీస్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్ సినిమాలలో కనిపించి తెలుగు ప్రజలను మెప్పించిన ఈ హీరో, ఇది వరకు చేయని ఒక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న చాలా తెలుగు సినిమాల్లో హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే తెలుగు హీరోలలో విజయ్ దేవరకొండ, రీసెంట్ గా 'వకీల్ సాబ్' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో మాట్లాడి జనాలను మెప్పించారు. మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న 'లవ్ స్టోరీ' సినిమాలో నాగ చైతన్య కూడా తెలంగాణ యాస లోనే మాట్లాడుతూ కనిపించబోతున్నాడు.
ఇప్పుడు వీరి బాటలోనే నాచురల్ స్టార్ నాని కూడా తెలంగాణ కుర్రాడి లా కనిపించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో పాటు 'అంటే సుందరానికి' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథను శ్రీకాంత్ ఇప్పటికే నాని కి వినిపించగా ఈ తరహా కథలో ఎప్పుడూ నటించని నాని వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని తెలంగాణ ప్రాంతానికి చెందిన కుర్రాడిలా, తెలంగాణ యాస మాట్లాడుతూ కనిపిస్తాడట, ఇలాంటి పాత్రను ఇంతవరకు నాచురల్ స్టార్ నాని చేయలేదు. అయితే ఈ సినిమాకు దసరా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా దసరా కే రాబోతున్నట్లు ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.