కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో విడుదలవుతున్న భారీ క్రేజ్ ఉన్న
సినిమా 'లవ్ స్టోరీ'.
నాగ చైతన్య హీరోగా
సాయి పల్లవి హీరోయిన్ గా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ ను ఈ మధ్య
హైదరాబాద్ లో చాలా అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కు
మెగాస్టార్ చిరంజీవి,
బాలీవుడ్ హీరో
అమీర్ ఖాన్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు. దీనిలో భాగంగా
మెగాస్టార్ చిరంజీవి,
సాయిపల్లవి గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
సాయి పల్లవి తో కలిసి డాన్స్ చేయాలని ఉందని మనసులో మాటను బయట పెట్టారు చిరంజీవి.
ఆ తర్వాత స్టేజ్ పై
సాయి పల్లవి తో కలిసి
చిరంజీవి ఒక చిన్న స్టెప్ కూడా వేశాడు. అయితే తాజాగా మీడియాతో ముచ్చటించిన
సాయి పల్లవి ఈ విషయంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
చిరంజీవి ది చాలా పెద్ద మనసు అని, అందుకే డాన్స్ బాగా చేస్తావు అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని
సాయి పల్లవి తెలిపింది. ఇక పోతే తనకంటే బాగా డాన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని అవకాశాలు వస్తే వాళ్లు కూడా నిరూపించుకున్నారు అని చెబుతూ అప్ కమింగ్ యాక్టర్ లకి, డాన్సర్ లకు
సాయిపల్లవి మంచి
జోష్ ను ఇచ్చింది. మంచి ఫీల్ గుడ్ ప్రేమకథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'లవ్ స్టోరీ' మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ,
అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే ఈ
సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలకు , ట్రైలర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.