బాలయ్య ఆ ఇద్దరి దర్శకులలో ఎవరు సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీలో బాలకృష్ణ రైతు గా , అఘోర రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో లను ఇప్పటికే మూవీ మేకర్స్ బయటకు వదలగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.


 ఇలా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకు, అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే సినిమాకు ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ ను కూడా ఇప్పటికే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం బాలకృష్ణ 'అఖండ' సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం అనిల్ రావిపూడి మంచి సక్సెస్ రేట్ లో ఉండడం, అని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్కే సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయం పట్ల ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. మరి బాలకృష్ణ ముందుగా ఏ దర్శకుడి సినిమాలో నటిస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: