"లవ్ స్టోరీ" లో ఆ పాత్రకు క్రేజ్ పెరుగుతోంది... ?
ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమ పాత్రకు 100 శాతం న్యాయం చేసారని అర్ధమవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి బాబాయ్ గా చేసిన రాజీవ్ కనకాల మాములుగా చేయలేదంటే నమ్మండి. సెకండ్ హాఫ్ లో దద్దరిల్లిపోయేలా చేశాడు. కులం మరియు పరువు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి పాత్రలో జీవించాడు. ఈ సినిమాలో రాజీవ్ నటన చుసిన చాలా మంది ఇన్ని సంవత్సరాలకు సరైన పాత్ర పడిందని ఎంతగానో రాజీవ్ పాత్రను మెచ్చుకుంటున్నారు. ఈ పాత్రకు ప్రజల్లో మంచి క్రేజ్ పెరుగుతోంది.
అప్పుడే సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ మొదలైపోయాయి. సుమక్క బావకి దిష్టి తీయి అంటూ థియేటర్ దగ్గర ఒకటే గోల. ఎప్పటి లాగే నాగ చైతన్య మరియు సాయి పల్లవి లు స్క్రీన్ ను ఒక ఆట ఆడేసుకున్నారు. ఈ సినిమా చూసిన ఏ ఒక్కరికైనా మళ్ళీ పరువు కోసం పిల్లల ప్రేమలపై పగలు పెంచుకునే ధోరణి ఆగుతుందని తెలుస్తోంది. సమాజానికి ఈ సమయంలో రావాల్సిన సినిమా. ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడే సమయంలో ఈ సినిమా గురించి ఏమీ చెప్పకుండా మీరు థియేటర్లో చూశాక మాట్లాడడానికి ఏమీ ఉండదని చెప్పాడు. సినిమా ఫలితం కూడా అలాగే ఉంది. స్పీచ్ లెస్ యాక్టింగ్ అని చెప్పాలి.