ఎస్పీ బాలు సంగీతాన్ని అందించిన సినిమాలివే ?

VAMSI
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్ప గాయకుడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎస్పీ బాలు తన గానంతో కోట్ల మంది ప్రజలను తన గాన సంద్రంలో మంచి మైమరపించి తన   అభిమానులుగా మార్చుకున్నారు.  తన గొప్ప గాయకుడు, గానగందర్వుడే కాదు. మంచి నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా ఇలా పలు పాత్రలు అధ్బుతంగా పోషిస్తూ సినీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకు మాత్రమే సొంతమైన అరుదైన ప్రత్యేక  స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంగీత దర్శకుడిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. పలు భాషల్లో గాయకుడిగా అస్సలు తీరిక లేని బిజీ సమయంలో కూడా ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకుడిగా మారి మధురమైన సంగీతాన్ని సమకూర్చారు.  40 ఏళ్ళ తన సినీ ప్రస్థానంలో 40 వేలకు పైగా పాటలను 11 భాషలలో పాడి ఆ పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసి, మరో వైపు 40 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే అరుదైన  రికార్డును సృష్టించి తెలుగువారి కీర్తిని నలుమూలలకు చాటారు బాలు. 
తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. ప్రముఖ గాయకుడిగానే కాకుండా, సంగీత దర్శకుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని మొత్తం 29 సార్లు అందుకుని తన సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మహనీయుడు బాలసుబ్రమణ్యం.  ఇపుడు ఆయనకు సంగీత దర్శకుడుగా గొప్ప గుర్తింపు తెచ్చిన చిత్రాలను తెలుసుకుందాం.  "పడమటి సంధ్యారాగం" చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ సినిమాలో సంగీతం అంటే ఇప్పటికి అంతే ఫేమస్. "మయూరి" చిత్రానికి కూడా బాలు సంగీత దర్శకుడిగా బాధ్యత వహించారు.
ఈ చిత్రానికి గాను ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా నంది అవార్డును అందుకోవడమే కాకుండా, సంగీత దర్శకుడిగా నంది అవార్డును కైవసం చేసుకున్నారు. లాయర్ సుహాసిని, ఊరంతా సంక్రాంతి, తూర్పు వెళ్లే రైలు, చిన్నోడు పెద్దోడు, మగధీరుడు, కళ్లు, రాము, జాకి, జైత్రయాత్ర వంటి చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపు పొందారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో యాభై చిత్రాలకు పైగా సంగీత దర్శకుడిగా సేవలను అందించారు.  ఈ రోజు ఎస్పీ బాలు మొదటి వర్ధంతి కావడం చేత ఆయన మెమోరీస్ ను గుర్తు చేసుకున్నాము...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: