టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ముందునుండే ఎన్నో అంచానాలు ఉన్న లవ్ స్టోరీ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు దాంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక లవ్ స్టోరీ సక్సెస్ ను చిత్ర యూనిట్ కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తోంది. సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి లవ్ స్టోరీ విజయం పై ఎమోషనల్ అయ్యింది. ఇండస్ట్రీలోని చాలా మంది లవ్ స్టోరీ సినిమాను తమ సినిమాలాగా ప్రమోషన్స్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. లవ్ స్టోరీ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని సాయిపల్లవి వ్యాఖ్యానించిది.
అంతే కాకుండా లవ్ స్టోరీ కేవలం ఎంటర్టైనమెంట్ కోసం చూసే సినిమా మాత్రమే కాదని సినిమాలో ప్రస్తుతం భయట జరుగుతున్న పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చూపించారని పేర్కొంది. ఇక ఈ సినిమా గురించి నాగచైతన్య మాట్లాడుతూ..సినిమాకు సర్వత్రా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా గురించి ఎంతో భయపడ్డామని కానీ ప్రేక్షకులు లవ్ స్టోరీ సినిమాను థియేటర్ కు వచ్చి చూడటం ఎంతో సంతోషంగా ఉందని నాతచైతన్య వ్యాఖ్యానించారు. శేకర్ కమ్ముల సినిమాలో చెప్పాలనుకున్న అంశానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారని నాగ చైతన్య పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ లవ్ స్టోరీ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులందరికీ మరియు చిత్ర యూనిట్ కు నాగచైతన్య కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చినట్టు కనిపిస్తోంది. కాగా సినిమా నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ ఈ చిత్ర యూనిట్ తో తమకు మంచి బంధం ఏర్పడిందని దానిని కొనసాగిస్తామని చెప్పారు. దాంతో లవ్ స్టోరీ కాంబో మరోసారి రిపీట్ కాబోంతుంటూ వార్తలు వస్తున్నాయి.