భార్యలను తిట్టిస్తావా...నేను తిడుతా ?

Veldandi Saikiran
పవన్ కళ్యాణ్ పై మరోసారి పోసాని షాకింగ్  కామెంట్స్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గురుంచి ప్రెస్మీట్ పెట్టానని....పొలిటికల్ లో విమర్శలు కామన్ అని చెప్పారు పోసాని.  మంత్రులను ,ఎమ్మెల్యే లను అరేయ్, ఒరేయ్ తిడతావు...నిన్ను తిడితే ఫ్యాన్స్ తో తిట్టిస్తావా...? అని ప్రశ్నించారు పోసాని. జగన్ గారు ఏం మాట్లాడారని... వేదవ లు అంటావా ? సర్దార్ గబ్బర్ సింగ్  షూటింగ్ లో త్వరగా   వెళితే...పవన్ ఫోన్ చేసి  మేము పిచ్చొ ళ్లమా అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్  అభిమాని, కార్యకర్తని... జగన్ ను తిడితే ఊరుకొనని హెచ్చరించారు.  

నిన్నటి నుంచి పవన్ మనుషులు వేల ఫోన్ లు, వందల మెసేజ్ లు...వాటిలో అమ్మన బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. "అరేయ్ పోసాని.. నీ పెళ్ళాం...పనోడితో అక్రమ సంబంధం పెట్టు కుందా?  లేదా?...అని  మెసేజ్ లు" పెడుతున్నారని పేర్కొన్నారు పోసాని.  చిరంజీవి గారు పార్టీ పెడితే.. చిరంజీవి కూతురు గురుంచి కేశినేని...బ్యాడ్ గా మాట్లాడరని.. ఆ సమయంలో  చిరంజీవి బాగా ఎడిచారని గుర్తు చేశారు పోసాని.  చిరంజీవి ఏడిస్తే...కన్నబాబు ఫోన్ చేస్తే...తాను ఆ రోజు చిరంజీవిని ఓదార్చానన్నారు.

నాని కి నేను కౌంటర్ వేస్తే...నోరు ముసాడని చెప్పారు పోసాని.  పవన్ కళ్యాణ్ ఓ సైకో... అల్లు అర్జున్ ఫంక్షన్ కి నీ ఫ్యాన్స్ పంపి..జై కొట్టమంటాడని ఫైర్ అయ్యారు పోసాని. పవన్ కళ్యాణ్ ఫాన్స్ చిల్లర మాటలకు  బయపడనని... పవన్ కళ్యాణ్ నీ ఫ్యాన్స్ తో తిట్టించిన వ్యభిచారి అని తిట్టించినా...బయపడను అని స్పష్టం చేశారు పోసాని. నువ్వు షూటింగ్స్  కి వెళ్లి నప్పుడు..నీ భార్య అలాంటి..ఇలాంటిది అంటే నువ్వు బాధపడవా... ? అని ప్రశ్నించారు.  ఓ రాజకీయ పార్టీ పెట్టిన వాడు... ఫ్యాన్స్ తో భార్యలను తిట్టిస్తాడా...? అని నిలదీశారు పోసాని.  "పవన్ కళ్యాణ్ నా కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి తీసుకొచ్చావు..... నీ కుటుంబ సభ్యులను తిడితే నువ్వు ఊరుకుంటావా....?"అని ఫైర్ అయ్యారు పోసాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: