దసరాకు సందడి చేయబోతున్న సినిమాలు..!

Pulgam Srinivas
తెలుగు ఇండస్ట్రీ లో దసరా పండగ వచ్చిందంటే సినిమాల జోరు మొదలవుతూ ఉంటుంది, ఎంతోమంది స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను దసరాకు తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దానికి ప్రధాన కారణం జనాలకు సెలవులు ఉండటం, పిల్లలకు కూడా స్కూల్ హాలిడేస్ ఉండడంతో కలెక్షన్లు బాగా రాబట్టవచ్చు అనే ఉద్దేశంతో సినిమాలను దసరాకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే పోయిన సంవత్సరం దసరా కు కరోనా ప్రభావం వల్ల సినిమాలు ఏవి విడుదల కాలేదు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం దసరాకు పెద్ద హీరోల సినిమాలు ఏవి విడుదల లేకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాలు సందడి చేయడానికి ముందుకు వస్తున్నాయి, అలా ఈ దసరాకు మన తెలుగులో జనాల ముందుకు రాబోతున్న సినిమాల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

రిపబ్లిక్.. సాయి ధరమ్ తేజ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా రెండు వారాల ముందే అక్టోబర్ 1వ తేదీన థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ఈ మధ్యే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా ఏర్పాటు చేశారు.


 సమకాలీన రాజకీయాల్ని ప్రక్షాళన చేసే ఓ కలెక్టర్ కథగా ఈమూవీని సరికొత్త కోణంలో దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ తరువాత అదే నెల 8న వైష్ణవ్ తేజ్.. క్రిష్ల `కొండ పొలం` విడుదల కావడానికి రెడీ గా ఉంది. మహా సముద్రం` అక్టోబర్ 15న రాబోతోంది. దీనికి ఒక్క రోజు ముందు అంటే అక్టోబర్ 14న అఖిల్ అక్కినేని .. పూజా హెగ్డేల `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఇదే బాటలో నాగశౌర్య అక్టోబర్ 15న రానుండగా.. రౌడీ బాయ్స్.. పెళ్లి సందడి కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇలా ఈ దగ్గరకు సినిమా పండగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: