ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా!!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేశాడు అనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఆయన భారీ బడ్జెట్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాను కూడా దాదాపు పూర్తి చేశాడని అంటున్నారు. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు కూడా ఇప్పటికే లాక్ అయిపోయాయి. సలార్ వేసవిలో విడుదల అవుతుండగా ఆదిపురుష్ ఆగస్టులో విడుదల అవుతున్నట్లు ఇటీవల చిత్రబృందం కూడా ప్రకటన చేసింది. ఆ విధంగా ఇప్పుడు ఆయన చేస్తున్న మరొక సినిమా విడుదల ఎప్పుడు జరుగుతుంది అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా ఆ సినిమా విడుదల కూడా ఇప్పుడు తెలుస్తూ ఉండడం ఒకసారి అభిమానులను సంతోషపరుస్తుంది.
నాగ్అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే కోసం పని చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ను డిసెంబర్ లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. ప్రభాస్ లేని సీన్లు షూట్ చేస్తుంది చిత్ర బృందం. త్వరలోనే ప్రభాస్ తో సీన్ లు చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని భావిస్తోంది యూనిట్. మరి వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ సినిమా ను థియేటర్ లలో చూడొచ్చన్నమాట. దీపికా పడుకోనే హీరోయిన్ గ నటిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.