"అర్జున్ రెడ్డి" విజయ్ దేవరకొండ చేయకపోతే... పరిస్థితి ఏమిటి?

VAMSI
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో కలెక్షన్ల సునామీ సృష్టించి మిడ్ నైట్ స్టార్ గా వెలుగులోకి వచ్చాడు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ మొదటి సినిమా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఇతనితో పాటు నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి సినిమా ప్రయత్నాలు చేసే వారు. కాళ్లు అరిగేలా తిరిగినా ఏళ్లు గడుస్తున్నా ఒక్క అవకాశం కూడా రాలేదు. అలాంటిది నేడు టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ఉన్నాడంటే అతడి టాలెంట్, నిబద్దత దానికి తోడు కొంత అదృష్టం కలిసి రావడమేనని చెప్పొచ్చు. ఇతడు స్క్రీన్ పై నటిస్తాడు అనడం కన్నా జీవిస్తాడు అంటే బాగుంటుందేమో! అంతగా సహజమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే అట్రాక్ట్ చేసేస్తాడు ఈ నవ యువ నటుడు.
ఆ తర్వాత రవిబాబు "నువ్విలా" సినిమాలో ఓ చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు విజయ్ కి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన "పెళ్లిచూపులు" చిత్రంతో సోలో హీరోగా పరిచయమయి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్క సారిగా స్టార్ హీరోగా ఎవరురూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు. నిజానికి మొదట ఈ సినిమా కథను సందీప్ వంగ మొదట అల్లు అర్జున్ కు చెప్పాడు. కానీ ఆయన నో చెప్పడంతో మరో ఇద్దరు స్టార్ హీరోలకు కూడా ఈ కథ వినిపించాడట, అయినా ఎవరూ ఒప్పుకోకపోవడంతో విజయ్ దేవరకొండపై ఉన్న నమ్మకంతో అతనికి చెప్పాడు.
వీరు మంచి ఫ్రెండ్స్ కావడంతో సందీప్ పై నమ్మకం ఉంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. అయితే ఒకేసారి ఈ హీరో నాలుగు చిత్రాలతో బిజీ అయిపోయాడు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ మార్కెట్ వాల్యూ ఓ రేంజ్ లో పెరిగింది. నేడు పాన్ ఇండియా హీరో స్థాయికి కూడా చేరుకున్నాడు విజయ్. ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఇప్పటికీ ఇండస్ట్రీలో ప్ర్మముఖులు అనుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: