మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో పోటీకి దిగుతున్న అభ్యర్థుల్లో మరింత జోష్ పెరిగింది. మా అధ్యక్షడికోసం ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, సీవిఎల్ నర్సింహరావు నామినేషన్ లు వేశారు. ఇక తమ ప్యానెల్ లను కూడా వీరు ప్రకటించి ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు కూడా ప్రచారంలో దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకు తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు నటుడు నరేష్ స్పష్టం చేశారు కూడా. అంతే కాకుండా తెలుగు వారే మా అధ్యక్షడు కావాలని నరేష్ కోరుకుటున్నట్టు బల్లగుద్ది చెప్పారు. ఇక మనోజ్ కు కూడా ప్రకాష్ రాజ్ లాగానే సపోర్ట్ అందుతోంది. కానీ మెగా సపోర్ట్ మాత్రం ముందు నుండి ప్రకాష్ రాజ్ కు ఉన్నట్టు కనిపిస్తోంది.
నాగ బాబు ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. తాను లోకల్ నాన్ లోకల్ చూడనని తన సపోర్ట్ మొత్తం ప్రకాష్ రాజ్ కే ఉంటుందని నాగబాబు చెప్పారు. అంతే కాకుండా మెగాస్టార్ సపోర్ట్ కూడా ప్రకాష్ రాజ్ కే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే మంచు విష్ణు ఇప్పుడు మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు మెగా సపోర్ట్ కోరుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా తనకు మెగా సపోర్ట్ కావాలని తండ్రి మోహన్ బాబుతో మంచు విష్ణు చెప్పారట. దానికి మోహన్ బాబు కూడా ఒప్పుకుని త్వరలో చిరంజీవితో ఈ విషయంపై మాట్లాడేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఇక చిరంజీవి సపోర్ట్ ఉంటే ఎన్నికల్లో ఎంతో లాభం చేకూరుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చిరు తన మాటలతో ఎంతో మందిని ఆకర్శిస్తుంటారు. కాబట్టి మోహన్ బాబు విష్ణు కోసం మెగా సపోర్ట్ ను పొందగలిగితే మా ఎన్నికల్లో విజయం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సారి మా ఎన్నికల్లో బండ్ల గణేష్ కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. బండ్ల ఎవరి ప్యానెల్ లోనూ ఉండకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు.