సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని సినిమాలు
రీమేక్ అవుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. ఒక భాషలో హిట్ అయినా ఫ్లాప్ అయిన సినిమాలను కూడా ఇంకో భాషలో
రీమేక్ చేస్తూ ఉంటారు.అలా
టాలీవుడ్ లో చాలావరకు
రీమేక్ సినిమాలు తెరకేక్కాయి. అదే విధంగా కొన్ని సినిమాలు ఇతర భాషలలోకి కూడా
టాలీవుడ్ లోని సినిమాలు కూడా
రీమేక్ అయ్యి ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు అన్ని భాషలలో సంచలనాన్ని సృష్టిస్తోంది ఓ సినిమా.. అదేమిటంటే బాలీవుడ్లో తెరకెక్కిన అంధదున్ సినిమా.
చాలారోజుల క్రితం ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం ఇప్పుడు పలు భాషల్లో విడుదల అవుతుండటం విశేషం. అయితే
బాలీవుడ్ లో ఈ
సినిమా హిట్ అయినా
టాలీవుడ్ లో పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. కారణాలు ఏవైనా కూడా ఈ చిత్రం ఇక్కడ విఫలం అయ్యింది. నితిన్ చేసిన ఈ
సినిమా లో చాలా లోపాలు ఉన్నాయని విశ్లేషకులు తేల్చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ
సినిమా నిర్మాత తెలివైన పని చేశాడు. దియేటర్లలో కాకుండా ఓ టీ టీ కి
సినిమా ను అమ్మి నష్టాల నుంచి తప్పుకున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాను ఇతర భాషలలో కొంతమంది హీరోలు
రీమేక్ చేయడానికి చూస్తున్నారు. ఆ విధంగా మలయాళంలో పృథ్వీరాజ్
హీరో గా ఈ
సినిమా ని
రీమేక్ చేశాడు అక్కడ
హీరోయిన్ రాశి
కన్నా నటించగా ఇక్కడ మాత్రం నాభ నటేష్ నటించింది.
తమన్నా పాత్ర ను అక్కడ
మమత మోహన్ దాస్ చేసింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ
సినిమా ఏ విధంగా ఉందో చూడాలి. తెలుగులో ఫ్లాప్ అయినా కూడా ఇతర భాషలలో హిట్టవడం తెలుగు ప్రేక్షకుల అభిరుచి తెలియజేస్తూ ఉంది. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు కొంత భిన్నంగా ఆలోచిస్తున్నారు ఇటీవల కాలంలో వారు కూడా సినిమాల విషయంలో చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయకపోతే సినిమాలు హిట్ అవ్వడం చాలా కష్టం. . ఆ విషయాన్ని గమనించిన మన
టాలీవుడ్ హీరోలు ఇప్పటికే వారి అభిరుచికి తగ్గట్టుగా మంచి మంచి సినిమాలన తెరకెక్కిస్తున్నారు.