సాయి తేజ్ "రిపబ్లిక్" హిట్ అవుతుందా ?

VAMSI
గత కొద్ది రోజుల క్రితం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కొద్దిలో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఈ రోడ్డు ప్రమాదాన్ని సైతం ఎందరో అనేక విధాలుగా తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతి త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ఇటీవల మెగా ఫ్యామిలీ తెలియచేసింది. అయితే ఈ రోడ్డు ప్రమాదంతో సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ రిలీజ్ పై ఫ్యాన్స్ కు ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ సినిమా ఇక రిలీజ్ చేస్తారా ? ఇంకా ఆలస్యం అవుతుందా ? అని కానీ రిపబ్లిక్ దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్ర యూనిట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ వేడుకను గత వారమే ఎంతో ఘనంగా జరిపారు.

ఇందులో పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రత్యేకంగా నిలిచింది. సాయి తేజ్ ఈ వేడుకకు రాకపోయినా పవన్ కళ్యాణ్ ఆ లోటును తెలియనివ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు సినిమా ఇండస్ట్రీ అటు పొలిటికల్ ఇండస్ట్రీ రెండూ బాగా  డిస్ట్రబ్ అయ్యాయి. ఇదే ఈ సినిమా ప్రమోషన్ లాగా అయిపోయింది. ఈ సినిమాను ఈ రోజు థియేటర్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం గత వారం రిలీజ్ అయిన శేఖర్ కమ్ముల మూవీ లవ్ స్టోరీ మంచి టాక్ తో కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ రోజు నుండి రిపబ్లిక్ మూవీ రిలీజ్ అవుతుండడంతో లవ్ స్టొరీ పై ఈ ప్రభావం చూపిస్తుందా లేదా తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. ఈ సినిమాలో సాయి తేజ్ మరియు ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్ లుగా నటించారు.

ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలలో విలక్షణ నటుడు  జగపతి బాబు మరియు శివగామి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చక్కని బాణీలను అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ట్రైలర్ మరియు పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి. ఫ్యాన్స్ లో సాయి తేజ్ పై ఉన్న సానుభూతి ఈ మేరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా విజయం సాధించాలని మెగా ఫ్యాన్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు.  దర్శకుడు దేవా కట్టా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  జె భగవాన్ మరియు పుల్లారావు లు జె బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. మరి సాయి తేజ్ ఈ సినిమాతో హిట్ ను అందుకుంటాడా అన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: