హోమియోపతి డాక్టర్ గా గుర్తింపు పొందిన హాస్యనటుడు..!
ఇంకా చెప్పాలంటే స్వర్గీయ నందమూరి తారకరామారావు అలాగే స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ కూడా అల్లురామలింగయ్య పేషెంట్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరికీ ఎటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురైనా, ముందుగా వచ్చేది అల్లు రామలింగయ్య దగ్గరికే.. అంతేకాదు మూడు తరాలుగా ఈయన సినీ ఇండస్ట్రీని హాస్యనటుడిగా ఏలిన విషయం తెలిసిందే.ఈ మూడు తరాల లో కూడా అల్లు రామలింగయ్య ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా వైద్య సేవలు అందించడం ఆయన గొప్పతనానికి ప్రతీక అని చెప్పవచ్చు.
నాటి నుంచి నేటి వరకు అల్లు రామలింగయ్య కుటుంబం కూడా హోమియోపతి ఫ్యామిలీ గా గుర్తింపు పొందుతోంది. కాన్స్టిట్యూషన్ మెడికల్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా ఉపశమనం కలిగించే హోమియోపతి వైద్య సేవలు అందించడం గమనార్హం. అల్లు రామలింగయ్య రాజమండ్రిలో హోమియోపతి మెడికల్ కాలేజీని కూడా స్థాపించడం జరిగింది.. ఈ కాలేజిని ప్రస్తుతం ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీని ద్వారా ఎంతో మంది ఉచితంగా వైద్య సేవలు పొందడమే కాకుండా నేటికీ ఆయన కుమారుడు.. అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన అల్లు అరవింద్ ఆ కాలేజీ అభివృద్ధికి తన వంతు సహాయంగా భాగస్వామి గా కొనసాగుతున్నారు.