ఆ స్టార్ హీరోయిన్ కి దిల్ రాజు బంపర్ ఆఫర్.. అన్ని కోట్లా..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. ఇప్పటికే తన బ్యానర్లో అగ్ర హీరోలతో వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అయితే ఓ స్టార్ హీరోయిన్ కి దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారట.ఆ హీరోయిన్ కి ఏకంగా 12 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..ఏంటా ఆఫర్..? అనే విషయంలోకి వెళితే..సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు. 


అయితే ఈ సినిమాలో చరణ్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ని సెలెక్ట్ చేసుకుంది చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా చేశారు దిల్ రాజు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాకి కూడా కియారా అద్వానీ నే హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట.ఈ నేపథ్యంలో కియారా అద్వానీ కిదిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.తన బ్యానర్ లో రూపొందనున్న మరో సినిమాలో కూడా కియారా ని హీరోయిన్ గా తీసుకుంటానని చెప్పి..


మొత్తం మూడు సినిమాలకు గానూ 12 కోట్లు పారితోషకం ఫిక్స్ చేసి ఒప్పందం కుదర్చుకోవడానికి దిల్ రాజు సిద్ధం అయ్యారని వార్తలు వస్తున్నాయి.అటు కియారా అద్వానీ కూడా ఈ ఆఫర్ పట్ల సముఖంగానే ఉందని తెలుస్తోంది.ఇక అన్నీ కుదిరితే దిల్ రాజు నిర్మించనున్న వరుస మూడు సినిమాల్లో కియారా అద్వానీ హీరోయిన్ గా అలరించే అవకాశం ఉందని చెప్పొచ్చు.ఇక ప్రస్తుతం కియారా అద్వానీ టాలీవుడ్లో తో పాటూ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.ఇక దిల్ రాజు రామ్ చరణ్, విజయ్ ప్రాజెక్ట్ లతో పాటూ అల్లు అర్జున్ తో ఐకాన్ ప్రాజెక్ట్ ని కూడా చేయనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: