ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మా ఎన్నికల జోరు ఎంత రసవ త్తరంగా జరుగుతుందో మనందరికీ తెలిసిందే, ఎన్నికల బరిలో ఉన్న వ్యక్తులు తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ఎలా ముందుకు సాగుతున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఎన్నికల జోరు పెంచు తున్నారు. పోటా పోటీగా ప్రెస్ మీట్ లు పెట్టుకుంటున్న అభ్యర్థుల మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తాజా గా పాల్గొన్న ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.
మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా, లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా అని మంచు విష్ణు అడిగిన ప్రశ్న బాగోలేదని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాడా, అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించాడు. పవన్ ప్రసంగాన్ని విశ్లేషించాలి, మొదటగా పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడు, ఆ తర్వాతే ఆయన రాజకీయ నాయకుడు.
మంచు విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టు కోవాలి. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకొని మాట్లాడాలి అని ప్రకాష్ రాజ్ తెలియజేశాడు. మీకు పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు , పవన్ కళ్యాణ్ రాజకీయ ఎజెండా మాకొద్దు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి నాకు తెలియదు. ఇండస్ట్రీ పరంగా పవన్ కళ్యాణ్ రెండు, మూడు ప్రశ్నలు అడిగారు. అవి పవన్ కళ్యాణ్ ఏ స్వరంతో అడిగాడు అన్నది మనం తర్వాత చూసుకుందాం. అంతే కానీ మీరు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా , ఇండస్ట్రీ పక్కన ఉన్నారా అని అడగడం సరి కాదు అని ప్రకాష్ తెలియజేశాడు.