చై సామ్ విడాకులు...మోసగాళ్ళు అంటూ సిద్దార్థ్ ట్వీట్ వైరల్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ లవ్లీ కపుల్ సమంత నాగచైతన్య విడిపోతారు అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్నట్టుగానే ఈ జంట విడిపోయింది. విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య ప్రకటించారు. ఎన్నో చర్చలు...ఆలోచనల తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సైతం ప్రకటించారు. దాదాపు దశాబ్ద కాలంగా తమ మధ్య బంధం ఉందని దాన్ని అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. విడిపోయినప్పటికీ స్నేహితులుగా ఒక ప్రత్యేక బంధం ఉంటుందని తెలిపారు. 


స్నేహితులు మరియు అభిమానులు అందరూ ఇలాంటి పరిస్థితుల్లో తమకు సహకరించాలని అదేవిధంగా మీడియా కూడా సహకరించాలని కోరారు. తాము జీవితంలో ముందుకు వెళ్లడానికి తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే సమంత చైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే హీరో సిద్ధార్థ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో సిద్ధార్థ్ మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. ఈ విషయాన్ని చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. అంతే కాకుండా మీరు ఏం నేర్చుకుంటున్నారు..? అంటూ సిద్దార్థ్ ప్రశ్నించారు. 


అయితే ఈ ట్వీట్ కు చేస్తున్న కామెంట్ల లో నెటిజన్లు సమంతను ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు సమంత సిద్ధార్థకు రిలేషన్ షిప్ ఉండేది అని అందువల్ల సిద్ధార్థ్ ఇప్పుడు ఇలాంటి ట్వీట్ చేశారని పేర్కొంటున్నారు. మరోవైపు సిద్ధార్థ చేసిన ట్వీట్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటివి చేయడానికి ఇదే సందర్భమా అని కొంత మంది నెటిజన్లు అతని పై మండిపడుతున్నారు. మరోవైపు సిద్ధార్థ గతంలో చేసిన ట్వీట్లు కూడా ఇప్పుడు వాళ్లు అవుతున్నాయి. గతం 2016లో సిద్ధార్థ్ రాసిపెట్టి ఉంటే నాగూర్ బిర్యాని వీధి కుక్కల వద్దకు వెళుతుంది. రాసిన రాత ను ఎవరు మార్చలేరు అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్ కూడా అప్పట్లో సిద్ధార్థ్ సమంత ను ఉద్దేశించి చేశారని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: