ఆ విషయంలో సమంత చైతన్య ఇద్దరు ఒకే మాట పై నిలబడ్డారట...!

murali krishna
దాదాపు పదేళ్ల స్నేహ బంధానికి మరియు నాలుగేళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలికారు నాగ చైతన్య మరియు సమంత. ఇకపై ఈమె మాజీ అక్కినేని కోడలు అనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది.

ఎందుకంటే అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ తో అంత బాగా కలిసిపోయిందట సమంత. అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్లిపోయిందని తెలిసిన తర్వాత ఫాన్స్ బాగా ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీ గురించి తెగ సర్చ్ చేస్తున్నారట నెటిజన్లు. ఎందుకంటే గతంలో నాగార్జున కూడా విడాకులు తీసుకున్నాడని అందరికి తెలుసు. అలాగే ఆయన మేనల్లుడు సుమంత్ కూడా హీరోయిన్ కీర్తి రెడ్డికి పెళ్లయిన రెండు సంవత్సరాల్లోనే విడాకులు ఇచ్చాడనే అందరికి తెలుసు. అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని తెలుస్తుంది..

ఇప్పుడు నాగచైతన్య, సమంత కూడా నాలుగు సంవత్సరాల పెళ్లి బంధానికి ముగింపు పలికారని అందరూ భాద పడుతున్నారట.
ముఖ్యంగా ఎప్పుడూ  కూల్‌గా కనిపించే నాగచైతన్య సినిమా ప్రపంచానికి మంచి యాక్టర్ గా కనిపించే సమంతలు ఒక్కటైనా ఇప్పుడు అవే రీజన్స్‌ వల్ల రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణాలయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇదంతా ఒకెత్తయితే బాలీవుడ్‌పై సమంతా ఫోకస్ చేస్తున్న వార్తలూ గట్టిగా వినిపిస్తున్నాయని సమాచారం.ఒక్క ఛాన్స్ అనేందుకు ముంబైకి మకాం మార్చాలనే ప్లాన్‌లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం.
నిజానికి చైతన్యతో వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుందన్న ఫ్యాన్స్‌కు సమంత తన బోల్డ్ క్యారెక్టర్లతో షాకిచ్చిందట. పెళ్లికి ముందు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన సమంత వివాహం తర్వాత మాత్రం విభిన్న పాత్రలతో ఆకట్టుకోవాలనుకుందని తెలుస్తుంది. దీంతో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ మంచి పేరు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తుందట. ఈ క్రమంలోనే తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ డీలక్స్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఆ బోల్డ్ క్యారెక్టర్‌పై అప్పట్లో పెద్ద దుమారమే రేగిందని తెలుస్తుంది. అయినప్పటికీ సమంత వెనక్కు తగ్గలేదట. ఫ్యామిలీమెన్-2 సిరీస్‌లో సూపర్ డీలక్స్‌కు మించిన బోల్డ్ క్యారెక్టర్‌తో మళ్లీ షాకిచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీమెన్-2లో సమంత చేసిన  సీన్లపై అక్కినేని ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సమాచారం.
అయితే ఒక విషయంలో మాత్రం ఈ జంట ఒకే మాట మీద ఉన్నట్లు తెలుస్తుంది. అధికారికంగా తాము విడిపోతున్నట్లు సమంత ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. ఆ తర్వాత నాగ చైతన్య కూడా అభిమానులకు ఈ విషయం అధికారికంగా చెప్పాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో తమ విడాకుల గురించి ఇద్దరు పోస్ట్ చేసింది ఒక్కటే లెటర్ అని తెలుస్తుంది. తమ మధ్య అభిప్రాయ భేదాల కారణంగా విడిపోతున్నాం అని ఇద్దరూ ఒకటే లెటర్ పోస్ట్ చేశారని తెలుస్తుంది. ఇది చూసి అభిమానులు షాక్ అయ్యారని సమాచారం.పోనీలే మిగిలిన విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉన్న.. లెటర్ విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే అభిప్రాయంతో అభిమానులకు తమ అభిప్రాయాలు తెలిపారు అంటున్నారట నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: