అక్కినేని అఖిల్ పెళ్లి క్యాన్సిల్.. అసలు విషయం ఇదీ..!

NAGARJUNA NAKKA
అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో మన్మథుడిగా పేరొందాడు. అలాంటి హీరో కుమారుల లైఫ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నాగచైతన్య-సమంత వైవాహిక బంధానికి చరమగీతం పాడేసింది. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా బయటకి వచ్చేసింది. ఇక అఖిల్ విషయం గురించి కూడా నెటిజన్లు చర్చించుకున్నట్టు సమాచారం.
అఖిల్.. నాగార్జున-అమల దంపతులకు జన్మించిన కుమారుడు. అప్పట్లో ఈ హీరో మ్యారేజ్ రద్దు కావడంపై తెలుగునాట పెద్దగా చర్చించుకునేలా చేసింది. అప్పట్లో శ్రీయాభూపాల్ తో పెళ్లి ఫిక్సయింది. కానీ ఏమైందో ఏమో కానీ రద్దయిపోయింది. శ్రీయా భూపాల్ ప్రముఖ పారిశ్రమామిక వేత్త జీవీకే కంపెనీల అధినేత మనుమరాలు.
అఖిల్-శ్రీయా భూపాల్ మ్యారేజ్ ఇటలీలో జరిపించాలని ఇరు ఫ్యామిలీలు డిసైడ్ అయ్యాయి. కానీ అంతలోనే అఖిల్-శ్రియ భూపాల్ మధ్య మనస్పర్థలు వచ్చాయనే టాక్ నడిచింది. దీంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టకుండానే వారి పెళ్లికి శుభం కార్డు పడింది.
మరోవైపు ఇంకో గాసిప్ కూడా వినిపించింది. అక్కినేని అఖిల్ కు వచ్చే ఆస్తుల వాటా విషయంలో సమస్యలు తలెత్తాయని టాక్ కూడా వినిపించింది. వారసులకు నాగార్జున ఆస్తులు పంపకాలు చేయాలని వియ్యంకుడు కోరాడనీ.. అందుకు నాగార్జున ఇది సమయం కాదని చెప్పాడనే టాక్ వచ్చింది. ఈ విషయంలో కూడా ఒక చిన్న వార్ నడిచినట్టు సమాచారం. పెళ్లికి కాక ముందే ఇలాంటి వ్యవహారం ముందుకు రావడంతో అఖిల్ పెళ్లి విషయంలో బ్యాక్ స్టెప్ వేసినట్టు సమాచారం.  
ప్రస్తుతం నాగచైతన్య, సమంతలు కూడా భార్యాభర్తలక బంధానికి గుడ్ బై చెప్పేశారు. దీంతో అక్కినేని ఫ్యామిలో పెళ్లిళ్ల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో స్పందించిన నాగార్జున... వీరిద్దరూ విడిపోవడం బాధాకరమన్నారు. ఇద్దరూ తనకు ఇష్టమేననీ.. సమంత తమ కుటుంబంతో మెలిగిన తీరు తీపి జ్ఞాపకమన్నారు. సమంత,నాగచైతన్య ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. విడాకుల వ్యవహారం వారి వ్యక్తిగతమని చెప్పారు.










మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: