చై - సామ్ : ఇండిపెండెంట్ విమెన్ ఇలానే ఉంటారు!
ఇండిపెండెంట్ విమెన్ ఎలా ఉంటారు.. సమంతలా ఉంటారు. కెరియర్ ను నిర్మించుకునే క్రమంలో ఉంటారు. వాటి కోసం కొన్ని వద్దనుకుంటారు. కొన్ని కావాలని పరితపిస్తారు. పరిశ్రమిస్తారు. ఇదే కోవలో సమంత తన జీవితాన్నీ, కెరియర్ నూ మార్చుకుని తీరాలన్న పంతంలో ఉన్నారు. అందుకే తనకు భరణంగా వస్తున్న రెండు వందల కోట్ల రూపాయలూ వద్దనుకున్నారు. తనకు డబ్బు వద్దని అంటున్నారు. అదేవిధంగా తాను కష్టపడి పైకి వచ్చిన అమ్మాయినని తనకు డబ్బువద్దని అని అంటున్నారని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమంత తన కెరియర్ ను నిర్మించుకునే క్రమంలో ఉన్నారని కూడా తెలుస్తోంది. నాగార్జున కోడలుగా తనకు వచ్చిన గుర్తింపు కన్నా సమంత తనకు తాను సంపాదించుకున్న లేదా సాధించుకున్న పేరే చాలా గొప్పది. అదే సక్సెస్ ప్రొగ్రస్ ను కంటిన్యూ చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా వివిధ భాషల్లో నటిగా రాణించాలని వెబ్ సిరీస్ లు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇవి అన్నీ పేపర్ వర్క్ దశలోనో, విజువలైజ్డ్ వెర్షన్ లోనో ఉన్నాయి. వీటన్నింటితో తనని తాను నిరూపించుకుంటూ, ఎదగాలని ఆశిస్తున్నారు. కానీ అమల అడ్డుపడుతున్నారని సమాచారం. అక్కినేని ఫ్యామిలీ అడ్డు పడుతోందని సమాచారం. అందుకే ఆమె బయటకు వచ్చేశారు ఆ కుటుంబం నుంచి.......