వినాయక్ ఇక తెలుగు సినిమా చేయడా.. మరో బాలీవుడ్ మూవీ!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ ప్రస్తుతం బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చత్రపతి రీమేక్ సినిమా ను చేస్తున్నాడు. అంతకుముందు తెలుగులో ఆయన చిరంజీవి గాడ్ ఫాదర్ రీమేక్ సినిమాను చేయాలని ప్రయత్నం చేయగా ఆయన స్క్రిప్ట్ తో చిరంజీవి ని ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. దాంతో వివి వినాయక్ టాలీవుడ్ లో తాను పరిచయం చేసిన హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ను బాలీవుడ్ లో పరిచయం చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే చత్రపతి సినిమాకి మాతృక దర్శకుడైన రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

 ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ లాంచింగ్ కార్యక్రమం సినిమా విజయోత్సవ వేదిక ను తలపించింది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలు యూట్యూబ్ లో హిందీలో విశేష ఆదరణ లభించిన నేపథ్యంలో కొంతమంది ఆయనకు కామెంట్లు చేసి డైరెక్ట్ హిందీ సినిమా చేయమని అడిగారు. దాంతో అక్కడి  ప్రేక్షకుల అభిరుచిని గమనించిన బెల్లంకొండ శ్రీనివాస్ వెంటనే చత్రపతి సినిమా ను బాలీవుడ్ లో చేయడానికి ముందుకు వచ్చి ఆ సినిమాను మొదలు పెట్టాడు. దర్శకుడు గా ఎవరిని ఎంచుకోవాలా అని చూడగా వారికి సమాధానంగా వి.వి.వినాయక్ కనిపించాడు.

అలా వినాయక్ బాలీవుడ్ లో ఈ సినిమా తో ఆరంగేట్రం చేస్తుండగా ఇప్పుడు బాలీవుడ్లో మరో ఆఫర్ కూడా ఆయనకు వచ్చిందట. రాజమౌళి ఈ రేంజిలో కాక పోయినా వినాయక్ కూడా కొన్ని యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు రాజమౌళి హిట్ సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నాడు కాబట్టి అంతకుమించిన యాక్షన్ సీన్లతో అక్కడి ప్రేక్షకులను మెప్పించాలి. అయితే బాలీవుడ్ లో ఓ హీరో ఆయన పనితనాన్ని చూసి ఎంతగానో మెచ్చుకుని తనతో సినిమా చేయాలని కోరాడట. దాంతో ఇప్పుడు ఆ హీరో ఈ కథను సిద్ధం చేసే పనిలో వి.వి.వినాయక్ ఉన్నాడు. ఏదేమైనా ఓ సినిమా అక్కడ విడుదల కాకముందే చిత్రీకరణ దశలో ఉండగానే వినాయక్ కు మరో సినిమా అవకాశం రావడం అంటే గొప్పే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: