సమస్యల్లో చిక్కుకున్న రాజమౌళి..

Purushottham Vinay
పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి కళాఖండం తరువాత బాగా ఆలోచించి అద్భుతమైన కాంబోని సెట్ చేయడం జరిగింది.నిజానికి ఇది రేర్ కాంబినేషన్.టాలీవుడ్ లో ఎనభై తొంబై లలో చూసుకుంటే అటు బాల కృష్ణ ఇటు చిరంజీవి పోటాపోటీగా సూపర్ స్టార్ డమ్ తో  పోటీ పడుతూ వచ్చారు. ఇక ఈ ఇద్దరు స్టార్లను కలిపి మల్టీ స్టారర్ సినిమా తీయాలని నాడు చాలా మంది ట్రై కూడా చేసినా ఎందుకో కుదరలేదు. అయితే ఇక వారి వారసులను కలిపి జక్కన్న టాలీవుడ్ కి సరికొత్త ఫీస్ట్ ని రెడీ చేసి పెట్టడం జరిగింది.ఇక అదే ట్రిపుల్ ఆర్ సినిమా.ఇక గత రెండేళ్ళ నుంచి కరోనా మహమ్మారి విలయతాండవం వల్ల ఈ పాన్ ఇండియా మూవీ తెగ చికాకు అనేది పడిపోయింది. మొత్తానికి అన్ని కష్టాలు దాటుకుంటూ ఈ సినిమా ఎలాగోలా తీరం చేరినా కాని ఇంకా థియేటర్లలో  బొమ్మ మాత్రం పడడంలేదు. దానికి కారణం ఏపీలో టికెట్ల రేటింగ్ కధ ఒక సమస్య. ఇంకో సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోకపోవడం అనేది మరో కథ.


ఇక కరోనా మహమ్మారి మూడవ దశ హెచ్చరికలు కూడా ఉండనే ఉన్నాయి.ఇక బడ్జెట్ పెరుగుతూ వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఈ సోలోగా రావడంలేదు. అపుడు కూడా చాలా సినిమాలతో ఈ సినిమా పోటీ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా అదే సీన్ ఉంది. అలాగని సంక్రాంతిని కనుక వదిలేస్తే మళ్ళీ సమ్మర్ కి వెళ్తుంది. ఇక అపుడు కూడా దేశంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది తెలీదు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ కాదు కానీ రాజమౌళి ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో రిస్క్ లో పడ్డట్లు తెలుస్తుంది.ఇక ఈ బొమ్మ హిట్ అయినా బ్లాక్ బస్టర్ కావాలన్నా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయాలన్నా సంక్రాంతి రిలీజ్ అనేది మాత్రం ఏమాత్రం సరైనది కాదు అలాగని సమ్మర్ కి వచ్చినా లాభాలు కాకుండా ఈ సినిమాకి నష్టాలు వచ్చే ఛాన్స్ వుంది. ఇక మొత్తానికి జక్కన్నకు ట్రిపుల్ ఆర్ ఏ రకమైన్ ఫలితం ఇస్తుందో అనేది చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: