వృధాగా మారిపోయిన దేవ కట్టా ఒంటరి పోరాటం !
అయితే పెద్దగా కమర్షియల్ హంగులు లేకపోవడం స్లో నరేషన్ ట్రాజిక్ క్లైమాక్స్ లాంటి అంశాలు ఈసినిమాకు ప్రతికూలంగా మారాయి. దీనికితోడు రివ్యూలు కూడ అంతంతమాత్రంగానే ఉండటంతో ఈమూవీకి కలక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈమూవీ రిలీజ్ కు ముందు సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరగడం అతడు ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేకపోవడంతో ఈమూవీని మెగా అభిమానులు కూడ పెద్దగా పట్టించుకోలేదు.
ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కు తెలుగులో అంతగా ఫాలోయింగ్ లేదు. ఆమె రిలీజ్ తర్వాత ప్రమోషన్లు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితులలో దేవ కట్టా ప్రమోషన్ల పరంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో సినిమా గురించి పెట్టిన పాజిటివ్ కామెంట్లన్నింటినీ సేకరించి తన ట్విట్టర్ లో షేర్ చేస్తున్నాడు. ఈసినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడిన వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతున్నాడు. అయినా ఈ సినిమాను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇప్పటికే ఈమూవీ దర్శకుడు కెరియర్ అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఈమూవీ కూడ ఫెయిల్ అయింది అంటూ వార్తలు వస్తూ ఉండటంతో భవిష్యత్ లో ఇతడికి పెద్దగా అవకాశాలు రాకపోవచ్చు. హిట్ లేకపోతే ఇండస్ట్రీ వర్గాలు పట్టించుకునే స్థితిలేని పరిస్థితులలో ఈ దర్శకుడి కెరియర్ కు సమస్యలు వచ్చే సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి తేజ్ మళ్ళీ ఎప్పటికి తేరుకుంటాడో తెలియని పరిస్థితులలో ఈమూవీ ఫెయిల్యూర్ తేజ్ కెరియర్ పై చాల ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా తేజ్ కు నడుస్తున్న కాలం బాగోలేదు అనుకోవాలి..