తక్కువ టైమ్ లో చేసేది చేసేస్తున్న ప్రగ్యా..!

NAGARJUNA NAKKA
హీరోయిన్ల సినీ జీవితం చాలా తక్కువగా ఉంటుంది. తమకున్న ఆ షార్ట్ పీరియడ్ లోనే.. ఎంత స్టార్డమ్ సంపాదించుకుంటే అంత ఎక్కువ బిజీగా ఉంటారు. ఒకవేళ ఏ మాత్రం తడబడినా కెరీర్ డల్‌ అయిపోతుంది. మళ్లీ కోలుకోవడం కష్టం అంటారు. కానీ ప్రగ్యాజైశ్వాల్ మాత్రం ఫేడవుట్‌ స్టేజ్‌ నుంచి స్టార్ రేసుకి చేరువవుతోంది.  న్యూ ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది.  

ప్రగ్యా జైశ్వాల్‌కి సరైన హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది. 'కంచె' తర్వాత ప్రగ్యాకి సరైన హిట్ ఒక్కటి కూడా రాలేదు. ఆరు సంవత్సరాల నుంచి ఫ్లాపులతోనే జీవితం గడుపుతోంది. దీంతో ఈ హీరోయిన్‌ని చాలామంది మర్చిపోయారు. ఇలాంటి సమయంలోనే 'అఖండ' సినిమాలో నటించే అవకాశం అందుకుంది ప్రగ్యా జైశ్వాల్. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో  వస్తోన్న 'అఖండ'లో హీరోయిన్‌గా చేస్తోంది ప్రగ్యా జైశ్వాల్.

ప్రగ్యా జైశ్వాల్‌ ఇటీవల మంచు విష్ణు సినిమాలోనూ అవకాశం అందుకుందట. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో మంచు విష్ణు 'ఢీ అండ్ ఢీ' అనే సినిమా చేస్తున్నాడు. 'ఢీ' సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రగ్యా ఒక హీరోయిన్‌గా చేస్తుందని తెలుస్తోంది. మరో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది.  

ప్రగ్యా జైశ్వాల్‌కి తెలుగులోనే కాదు, బాలీవుడ్‌ నుంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ 'అంతిమ్-ది ఫైనల్ ట్రూత్'లో హీరోయిన్‌గా చేస్తోంది ప్రగ్యా జైశ్వాల్. మరి ఫ్లాపులతో ఫేడవుట్‌కి దగ్గరవుతోన్న సమయంలో వస్తోన్న ఈ అవకాశాలతో ప్రగ్యా జైశ్వాల్‌ కెరీర్‌ ఎలాంటి రికార్డుల వైపు నడిస్తుందో మరి. ప్రేక్షకులు మాత్రం ప్రగ్యాను బాగానే ఆదరిస్తున్నారు. ఆమెకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు.

మొత్తానికి ప్రగ్యా జైశ్వాల్ తనకున్న తక్కువ సమయాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటోంది. దేనికీ కాదని చెప్పడం లేదు.. ఎవరు ఎలాంటి అవకాశం ఇచ్చినా.. దూసుకెళ్తోంది. ఏం చేయాలని చెప్పినా.. నో అబ్జెక్షన్ అంటోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: