జక్కన్న మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!!

P.Nishanth Kumar
దర్శకధీరుడు రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వచ్చే ఏడాది తప్పకుండా రిలీజ్ అవుతుందని భావించగా ఇంత తొందరగా ఈ చిత్రం విడుదల అవుతుందని ఎవరూ ఊహించలేదు... తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల అవుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో సినిమాను ఇంకా పొడిగిస్తే చిత్రంపై క్రేజ్ తగ్గే అవకాశం ఉందని రాజమౌళి ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఇకపోతే ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరొక అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేశారని తెలిపింది. తెలంగాణ మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.  మరో మూడు నెలల్లో విడుదల కానున్న ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. 

రాధే శ్యామ్ సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదల అవుతుండగా ఈ సినిమా ఓ టీ టీ హక్కులను జి5 మరియు నెట్ ఫిక్స్ సంస్థలు కొనుగోలు చేశాయి.  నెట్ ఫిక్స్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ తో పాటు స్పానిష్ పోర్చుగీస్ కొరియర్ వెర్షన్ సినిమా విడుదల కానున్నాయి. ఇండియన్ లాంగ్వేజెస్ లు జీ 5 లో విడుదల కానున్నాయి.  సంక్రాంతికి ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మిగతా సినిమాలు తప్పించి ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు జక్కన్న. మరి జక్కన్న వేసిన మాస్టర్ ప్లాన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. బాహుబలి తర్వాత చేస్తున్న ఈ సినిమా ఎంత పెద్ద మెగా హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: