సీనియర్ హీరోయిన్ నెటిజన్లపై సీరియస్...!
ముఖ్యంగా సమంత తన శరీరంపై నాగచైతన్య గుర్తులను టాటు వేయించుకున్నారు. విడాకులకు ముందే టాటులను చెరిపేశారు. టాటూలతోనే వారిద్దరీ మధ్య బంధం తెగిపోయిందని చాలా వరకు తెలిసిపోయింది. ఇదిలా ఉండగానే సమంత తన పేరులో ఉన్న అక్కినేని అనే పదాన్ని తొలగించడంతో విడాకులు తీసుకుంటారని క్లారిటీ వచ్చింది. ఈ సమయంలోనే సమంత ముంబయి వెళ్లినట్టు తెలిసింది. కానీ సమంత తనకు హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టమని ట్విట్టర్లో పేర్కొన్న విషయం విధితమే. చివరకు వీరిరువురు విడాకులపై ఓ క్లారిటీ ఇచ్చారు.
ఇది ఇలా ఉండగా నెటిజన్లు నాగచైతన్య, సమంత విడాకులపై తెగ ట్రోల్ చేస్తున్నారు. విడాకులకు సమంతనే కారణమని కొందరంటుంటే.. కాదు నాగ చైతన్యనే కారణమని మరికొందరూ పేర్కొంటున్నారు. ఎవరికీ వారు రకరకాలుగా సోషల్ మీడియాలో వారికి తోచిన విధంగా పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో నెటిజన్స్‌పై సీనియర్ నటీ ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. నాగచైతన్య, సమంత దంపతులు విడిపోయారు. వారి వ్యక్తిగతమైన విషయం. వారు విడిపోవడానికి కారణం ఏమిటనేది వారిద్దరికీ తప్ప మరెవ్వరికీ తెలియదు అని సీరియస్ అయ్యారు. వారి వ్యక్తి గత విషయాలను అందరం గౌరవించాలి. తప్ప అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఊహించుకోవద్దని ఖుష్బూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఖుష్బూ ట్విట్ పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.